అధికారులకు జగన్ వారం రోజుల వార్నింగ్

ఏపీ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారం రోజుల వార్నింగ్ ఇచ్చారు. అమరావతి క్యాంప్ ఆఫీసులో గురువారం కీలకమైన సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ఈ సమీక్షా సమావేశంలోనే ఆయన అధికారులకు వారం రోజుల వార్నింగ్ ఇచ్చారు. ఉగాది పండుగ రోజున 25 లక్షల ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేగవంతం చేశారు. ఈ అంశంపై గురువారం తన క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమీక్ష జరిపారు సీఎం. ఈ […]

అధికారులకు జగన్ వారం రోజుల వార్నింగ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 26, 2019 | 6:01 PM

ఏపీ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారం రోజుల వార్నింగ్ ఇచ్చారు. అమరావతి క్యాంప్ ఆఫీసులో గురువారం కీలకమైన సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ఈ సమీక్షా సమావేశంలోనే ఆయన అధికారులకు వారం రోజుల వార్నింగ్ ఇచ్చారు.

ఉగాది పండుగ రోజున 25 లక్షల ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేగవంతం చేశారు. ఈ అంశంపై గురువారం తన క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమీక్ష జరిపారు సీఎం. ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, సీఎస్‌ నీలం సహానీ ఇతర అధికారులు హాజరయ్యారు.

ఈ భేటీలో కీలకమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్య, గుర్తించిన స్థలాలపై సమీక్ష జరిపారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇళ్ల పట్టాలకోసం అధికంగా భూములు సేకరించాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. భూముల గుర్తింపు వారం రోజుల్లో పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు.

లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు మార్కింగ్‌ చేసి ఇంటిపట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. పట్టాపత్రాన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌తో రూపొందించాలని చెప్పారాయన. దీనికి సంబంధించి పలు రకాల నమూనా పత్రాలను అధికారులు సీఎంకు చూపించారు. అర్హత ఉండి ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

ఇప్పటివరక 22 లక్షల 46 వేల139 మంది లబ్ధిదారులను గుర్తించామని, వీరిలో 11 లక్షల 77 వేల 260 మంది గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులని, 10 లక్షల 99 వేల 160 మంది పట్ణణ ప్రాంతాల్లో లబ్ధిదారులని అధికారులు గణాంకాలను సీఎంకు తెలిపారు. వీరందరికీ ఇళ్ళ పట్టాలిచ్చేందుకు సుమారు 23 వేల ఎకరాల భూములు అవసరమని చెబుతున్నారు.

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే