తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్

తిరుమల: ఇస్రో.. చందమామ దక్షిణ ధ్రువంపై ఫోకస్ పెడుతూ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-2 ప్రయోగం నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్‌ శివన్‌, పలువురు శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్‌-2 వాహకనౌక నమూనాకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని […]

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 13, 2019 | 4:47 PM

తిరుమల: ఇస్రో.. చందమామ దక్షిణ ధ్రువంపై ఫోకస్ పెడుతూ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-2 ప్రయోగం నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్‌ శివన్‌, పలువురు శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్‌-2 వాహకనౌక నమూనాకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

చంద్రయాన్-2 ప్రయోగాన్ని జులై 15న చేపట్టబోతోంది. ఆ రోజు తెల్లవారు జామున 2.51 గంటలకు… నెల్లూరు జిల్లాలోని… శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ సంస్థలోని రెండో ప్రయోగ వేదిక నుంచీ చంద్రయాన్-2 శాటిలైట్‌ని పంపబోతోంది.