అయిదో కప్పును అందుకుంటామంటున్న హార్దిక్‌ పాండ్య

ఈసారి ఐపీఎల్‌ కప్పు కూడా తమదేనంటున్నాడు ముంబాయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. నాలుగుసార్లు టైటిల్‌ను అందుకున్న తాము అయిదో కప్పును కూడా ఎగరేసుకుపోతామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

అయిదో కప్పును అందుకుంటామంటున్న హార్దిక్‌ పాండ్య

Updated on: Nov 05, 2020 | 12:50 PM

ఈసారి ఐపీఎల్‌ కప్పు కూడా తమదేనంటున్నాడు ముంబాయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. నాలుగుసార్లు టైటిల్‌ను అందుకున్న తాము అయిదో కప్పును కూడా ఎగరేసుకుపోతామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటి వరకు తమ టీమ్‌ మెంబర్స్‌ అంతా బాగా ఆడారని, ఇంతకు మించి ఎక్కువ ఆశించలేమని ట్వీట్‌ చేశాడు హార్దిక్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన ముంబాయి ఇండియన్స్‌ లీగ్‌ దశలో అద్భుతంగా రాణించింది.. ఇదే విషయాన్ని హార్దిక్‌ చెప్పాడు.. ఇప్పటి వరకు అంతా బాగానే సాగిందని, అవసరమైనప్పుడు ప్రతీ ఒక్కరు చక్కగా ఆడారని అన్నాడు.. ఇంతకు ముందు కంటే ఈసారి ఐపీఎల్‌లో ఇంకా ఎక్కువగా రాణించామన్నాడు.. ఇది తనకో చక్కటి అవకాశమని చెప్పుకొచ్చాడు. తమకు అన్ని అనుకూలమైన ఫలితాలే వస్తున్నాయని, అసలైన పోరులోనూ అదే జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని హార్దిక్‌ అన్నాడు. ముంబాయి ఇండియన్స్‌ ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడుతోంది.. రోహిత్‌శర్మ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నా పోలార్డ్‌ తన అనుభవాన్ని రంగరించి జట్టుకు విజయాలను అందించాడు.. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబాయి విజయం సాధిస్తే ఫైనల్స్‌కు వెళుతుంది..