కరోనా విరామం తర్వాత ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా మొదలైంది. తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలబడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. చెన్నై జట్టులో షేన్ వాట్సన్, డుప్లెసిస్, సామ్ కర్రన్, ఎంగిడిలు విదేశీ ప్లేయర్లు కాగా.. ముంబై జట్టులో డికాక్, పొలార్డ్, పాటిన్సన్, బౌల్ట్‌లు విదేశీ ఆటగాళ్లుగా బరిలోకి దిగుతున్నారు. (IPL 2020)
చెన్నై: మురళీ విజయ్, వాట్సన్, డుప్లెసిస్, రాయుడు, కేదార్ జాదవ్, ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), జడేజా, సామ్ కర్రన్, దీపక్ చాహర్, చావ్లా, ఎంగిడి
ముంబై: రోహిత్ శర్మ, డికాక్, సూర్య కుమార్ యాదవ్, సౌరబ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్, పొలార్డ్, పాటిన్సన్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా
A look at the Playing XI for #MIvCSK
Follow the game here –https://t.co/HAaPi3BpDG #Dream11IPL https://t.co/58ufXiF7QO pic.twitter.com/fiMlTQjw0o
— IndianPremierLeague (@IPL) September 19, 2020