ధోని లేని టీమ్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతోన్న ముంబాయి

ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచిత్తు చేసిన ముంబాయి ఇండియన్స్‌ ఫైనల్‌ పోరుకు సిద్ధమవుతోంది.. ఇప్పటి వరకు నాలుగుసార్లు విజేతగా నిలిచిన నిలిచిన ముంబాయి టీమ్‌ అయిదుసార్లు ఫైనల్స్‌కు చేరింది..

ధోని లేని టీమ్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతోన్న ముంబాయి

Updated on: Nov 06, 2020 | 4:28 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచిత్తు చేసిన ముంబాయి ఇండియన్స్‌ ఫైనల్‌ పోరుకు సిద్ధమవుతోంది.. ఇప్పటి వరకు నాలుగుసార్లు విజేతగా నిలిచిన నిలిచిన ముంబాయి టీమ్‌ అయిదుసార్లు ఫైనల్స్‌కు చేరింది.. 2010లో మొదటిసారి ఫైనల్లో అడుగుపెట్టిన ముంబాయి టీమ్‌ తుది పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో ఓడిపోయింది.. అలా రన్నరప్‌గా నిలిచింది.. 2013, 2015, 2017, 2019 లలో మాత్రం అలాంటి పొరపాటు చేయకుండా కప్పును గెల్చుకుంది.. విచిత్రమేమిటంటే ఇప్పటి వరకు ముంబాయి ఆడిన ప్రతి ఫైనల్‌ పోరులోనూ ప్రత్యర్థి టీమ్‌లో మహేంద్రసింగ్‌ ధోని ఉండటం.. 2017 సీజన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆడలేదు.. ఆ ప్లేస్‌లో వచ్చిన పుణె సూపర్‌ జెయింట్స్‌ ఫైనల్స్‌కు చేరింది. అప్పుడా జట్టులో ధోని ఉన్నాడు.. కాకపోతే పుణే జట్టకు స్టీవ్‌ స్మిత్‌ సారథ్యం వహించాడు.. తుది సమరంలో ముంబాయి ఇండియన్స్‌ జట్టు ఒక్క పరుగు తేడాతో పుణే సూపర్‌ జెయింట్స్‌ను ఓడించి టైటిల్‌ను గెల్చుకుంది. ఈసారి మాత్రం ధోని లేని టీమ్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతోంది.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరకపోవడమే ఇందుకు కారణం.. ఇలాంటి దుస్థితి చెన్నై సూపర్‌కింగ్స్‌ ఎదురవ్వడం ఇదే ప్రథమం..