మరికొద్ది సేపట్లో బెంగళూరు, పంజాబ్‌ మధ్య పోరు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఓ రసవత్తరమైన మ్యాచ్‌కు మరికొద్దిగంటల్లో తెరలేవనుంది.. గెలుపు మీద కసితో ఉన్న రెండు జట్ల మధ్య పోరు సహజంగానే ఉత్కంఠతను, ఆసక్తిని కలిగిస్తాయి..

మరికొద్ది సేపట్లో బెంగళూరు, పంజాబ్‌ మధ్య పోరు
Follow us

|

Updated on: Sep 24, 2020 | 3:45 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఓ రసవత్తరమైన మ్యాచ్‌కు మరికొద్దిగంటల్లో తెరలేవనుంది.. గెలుపు మీద కసితో ఉన్న రెండు జట్ల మధ్య పోరు సహజంగానే ఉత్కంఠతను, ఆసక్తిని కలిగిస్తాయి.. సాయంత్రం దుబాయ్‌లో జరగబోయే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌ టన్నుల కొద్దీ మజాను ఇవ్వడం మాత్రం గ్యారంటీ.. మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను మట్టికరిపించిన బెంగళూరు ఆ విజయం తెచ్చిన విశ్వాసంతో బరిలో దిగుతోంది.. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో ఎమిరేట్స్‌లో అడుగుపెట్టిన బెంగళూరు అందుకు తగినట్టుగానే ఆడుతోంది.. మరోవైపు మొదటి మ్యాచ్‌లో విజయతీరాలకు చేరువయ్యి.. సూపర్‌ ఓవర్‌లో పరాజయం పాలైన పంజాబ్‌ కూడా గెలవాలన్న గట్టి పట్టుదలతో ఉంది.. అంపైర్‌ చేసిన మిస్టేక్‌ కారణంగానే మొదటి మ్యాచ్‌లో ఓడిపోయామన్న భావన ఆ జట్టులో మరింత కసిని రేపుతోంది.

బెంగళూరు జట్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు స్ట్రాంగ్‌గానే ఉన్నాయి.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్థ శతకాన్ని బాదిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ తన ఫామ్‌ను కొనసాగించాలని అనుకుంటున్నాడు.. డివిలియర్స్‌, కోహ్లీలు బ్యాట్‌కు పనిచెబితే స్కోరుబోర్డు ఉరకలెత్తడం ఖాయం. ఫించ్‌ కూడా వీరబాదుడు బాదే రకమే! అలాగని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌లో బ్యాట్స్‌మన్‌ లేరా అంటే అక్కడా అతిరథులున్నారు.. రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, మ్యాక్స్‌వెల్‌, క్రిస్‌ గేల్‌.. వీరంతా హిట్టర్లే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ ఆట తీరును మనం చూశాం.. తొలి మ్యాచ్‌లో తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన క్రిస్‌ గేల్‌ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఇక బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ విషయానికి వస్తే బెంగళూరు ఇందులో కూడా బలంగానే ఉంది.. నవదీప్‌ పదునైన బౌలింగ్‌ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది.. యుజేంద్ర చాహల్‌ కూడా చక్కగా రాణిస్తున్నాడు. ఉమేశ్‌ యాదవ్‌ కూడా లైన్‌ అండ్‌ లెంత్‌ను దొరకపుచ్చుకుంటే ఇక బెంగళూరుకు తిరుగే ఉండదు.. ఇక ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ బౌలర్లు మహ్మద్‌ షమీ, కాంట్రెల్‌, రవి బిష్ణోయ్‌లు బాగా రాణించారు.. ఈ మ్యాచ్‌లో షమీ నాలుగు ఓవర్లలో 15 రన్స్‌కు మూడు వికెట్లు తీసుకున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కాకపోతే బెంగళూరు టీమ్‌ను కంట్రోల్‌ చేయాలంటే కట్టుదిట్టమైన బౌలింగ్‌ అవసరమన్నది పంజాబ్‌ తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు 24 సార్లు తలపడ్డాయి. చెరో 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. అంటే సమ ఉజ్జీలన్నమాట! అయితే చివరి అయిదు మ్యాచుల్లో నాలుగింటిలో బెంగుళూరు గెలిచింది.. టాస్‌ గెలిచిన జట్టు ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించవచ్చు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), మొహమ్మద్‌ సిరాజ్, షహబాజ్‌ అహ్మద్, పార్థివ్‌ పటేల్, యజువేంద్ర చహల్, నవదీప్‌ సైనీ, పవన్‌ నేగి, దేవ్‌దత్‌ పడిక్కల్, శివమ్‌ దూబే, ఉమేశ్‌ యాదవ్, గుర్‌కీరత్‌ సింగ్, వాషింగ్టన్‌ సుందర్, పవన్‌ దేశ్‌పాండే (భారత ఆటగాళ్లు). క్రిస్‌ మోరిస్, జోష్‌ ఫిలిప్, మొయిన్‌ అలీ, ఆరోన్‌ ఫించ్, ఏబీ డివిలియర్స్, ఇసురు ఉదాన, డేల్‌ స్టెయిన్, ఆడమ్‌ జంపా(విదేశీ ఆటగాళ్లు).

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), హర్‌ప్రీత్‌ బ్రార్, ఇషాన్‌ పొరెల్, మన్‌దీప్‌ సింగ్, తజీందర్‌ సింగ్, కరుణ్‌ నాయర్, దీపక్‌ హుడా, రవి బిష్ణోయ్, అర్‌‡్షదీప్‌ సింగ్, సర్ఫరాజ్‌ ఖాన్, మయాంక్‌ అగర్వాల్, మొహమ్మద్‌ షమీ, దర్శన్‌ నల్‌కండే, మురుగన్‌ అశ్విన్, జగదీశ్‌ సుచిత్, కృష్ణప్ప గౌతమ్, సిమ్రన్‌ సింగ్‌ (భారత ఆటగాళ్లు). జిమ్మీ నీషమ్, క్రిస్‌ జోర్డాన్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, ముజీబ్‌ ఉర్‌ రహమాన్, షెల్డన్‌ కాట్రెల్, నికోలస్‌ పూరన్, క్రిస్‌ గేల్, హార్దర్‌ విలోన్‌ (విదేశీ ఆటగాళ్లు).

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో