రాజస్థాన్ Vs చెన్నై: ఫోర్లు తక్కువ.. సిక్సర్లు ఎక్కువ..

ఐపీఎల్ 2020 ప్రతీ మ్యాచ్‌కు ప్రేక్షకులకు కావల్సినంత మజా లభిస్తోంది. మొదటి మూడు మ్యాచ్‌లకు భిన్నంగా నిన్న చెన్నై, రాజస్థాన్ మ్యాచ్‌లో సిక్సర్ల(33) వర్షం కురిసింది.

రాజస్థాన్ Vs చెన్నై: ఫోర్లు తక్కువ.. సిక్సర్లు ఎక్కువ..
Follow us

|

Updated on: Sep 23, 2020 | 5:11 PM

ఐపీఎల్ 2020 ప్రతీ మ్యాచ్‌కు ప్రేక్షకులకు కావల్సినంత మజా లభిస్తోంది. మొదటి మూడు మ్యాచ్‌లకు భిన్నంగా నిన్న చెన్నై, రాజస్థాన్ మ్యాచ్‌లో సిక్సర్ల(33) వర్షం కురిసింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ దిగిన రాయల్స్ జట్టు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. (IPL 2020)

రాయల్స్ తమ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు నమోదు చేయగా.. కేవలం 9 ఫోర్లు మాత్రమే కొట్టారు. యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ ఏకంగా 9 సిక్సర్లు కొట్టగా, స్మిత్ 4 సిక్సర్లతో చెలరేగాడు. చివరి ఓవర్‌లో అయితే ఆర్చర్ పూనకం వచ్చినట్లు.. ఎంగిడి బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లతో చెలరేగిపోయాడు.

అటు లక్ష్య చేధనలో చెన్నై బ్యాట్స్‌మెన్‌ కూడా ధీటుగానే జవాబిచ్చారు. వాట్సన్ నాలుగు సిక్సర్లు కొట్టగా.. కరన్‌ రెండు సిక్సర్లు.. డుప్లెసిస్ ఏడు సిక్సర్లతో హోరెత్తించారు. చివర్లో ధోని అయితే మూడు సిక్సర్లతో చెలరేగాడు. దీనితో మొత్తంగా మ్యాచ్‌లో 33 సిక్సర్లు నమోదు కావడంతో పాటు.. ఐపీఎల్ చరిత్రలో ఇన్ని సిక్సర్లు కొట్టిన రెండో మ్యాచ్ ఇదే కావడం విశేషం.