ఐపీఎల్ 2020: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే.. హైదరాబాద్ గెలవాల్సిందే.!

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలబడనున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో భాగంగా ఈ పోరు ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే హైదరాబాద్ అవకాశాలు దాదాపు గల్లంతైనట్లే. ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఏడింటిలో ఓడిపోయి.. కేవలం నాలుగింటిలో గెలుపొందింది.  అటు ఢిల్లీ ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి.. నాలుగింటిలో ఓటమి ఎదుర్కొంది. అటు ఢిల్లీకి.. ఇటు […]

  • Ravi Kiran
  • Publish Date - 9:51 am, Tue, 27 October 20

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలబడనున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో భాగంగా ఈ పోరు ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే హైదరాబాద్ అవకాశాలు దాదాపు గల్లంతైనట్లే. ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఏడింటిలో ఓడిపోయి.. కేవలం నాలుగింటిలో గెలుపొందింది.  అటు ఢిల్లీ ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి.. నాలుగింటిలో ఓటమి ఎదుర్కొంది. అటు ఢిల్లీకి.. ఇటు హైదరాబాద్‌కు బ్యాటింగ్ మైనస్‌గా మారింది. ఇక ఢిల్లీ జట్టు గత మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓడిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్‌కు ఫుల్ లెంగ్త్ స్ట్రెంగ్త్‌తో బరిలోకి దిగనుంది.

గాయం కారణంగా స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ జట్టుకు దూరం కావడం హైదరాబాద్‌కు పెద్ద ఎదురుదెబ్బ. అలాగే మిడిల్ ఆర్డర్ మెరుపులు మెరిపించకపోవడం మైనస్‌గా మారింది. ఇప్పటిదాకా వార్నర్, బెయిర్‌స్టోలు కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇక హైదరాబాద్ జట్టుకు బౌలర్లే బలం. సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్, హోల్డర్, నటరాజన్‌తో ఆ జట్టు బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. బ్యాట్స్‌మెన్ కూడా స్థాయికి తగ్గట్టు ఆడితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఢిల్లీకి గట్టి పోటీ ఇస్తుందని చెప్పాలి.