Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348. . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • టీవీ9 తో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు. తెలంగాణలో కోవిడ్ కు సంబంధించి అన్ని సిధంగా ఉన్నాయి. ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు. డాక్టర్ల ను కాపాడుకుంటాం. రాష్ట్రంలో ఎడులక్షల ppe కిట్స్. N95మాస్కులు ఎనిమిది లక్షలు ఉన్నాయి.
  • అమరావతి లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి రంగం సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
  • ఢిల్లీ: ఢిల్లీలో మాస్కులేకుండా ఇళ్లనుంచి బయటకు వెళ్తే 500 రూపాయల జరిమాన. ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన లెఫ్ట్నెంట్ గవర్నర్. కరోనా కేసులు పెరుగుతున్నందున నేపథ్యంలో ఈ నిర్ణయం.
  • టిటిడి ఏఈవో ధర్మారెడ్డి కామెంట్స్. ఇతర రాష్ట్రాలతో ఉన్నవారు..ఆన్ లైన్లో తిరుమల దర్శన టికెట్ తీసుకున్నప్పటికీ..ఆ టికెట్..రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎంట్రీకి పనికిరాదు. వేరే రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చిన సూచనల మేరకు పాసులు తీసుకోవాలి. వీఐపీ బ్రేక్ దర్శనాలు సిఫార్స్ లేఖలు అనుమతించేది లేదు. ఎవరినీ దర్శనాలకి ఎవరికీ రికమండే షన్ పత్రాలు ఇవ్వొద్దు. ఎవరైతే వీఐపీలు ఉన్నారో వారికి మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకి అనుమతిస్తాము.
  • విశాఖ: సుధాకర్ తల్లి కావేరీ భాయ్. సుధాకర్ కు, నాకు, సుధాకర్ కొడుకు లలిత్ ను సీబీఐ విచారించింది. నా కొడుకును చాలా బాధ పెట్టారు. ఆరోగ్యంగా ఉన్న వాడిని ఆసుపత్రిలో పెట్టి అనారోగ్యానికి పాలు చేశారు. నా బిడ్డకు జరిగిన ట్రీట్ మెంట్.. ఎవరికీ జరగకూడదు సుధాకర్ కు జరిగిన అన్యాయం అందరికీ తెలుసు.. కానీ భయపడి ఎవరూ నోరు విపొఅడం లేదు. పాలకులే కష్టాలు తెచ్చిపెడితే.. ఇంకా కష్టం ఎవరికి చెప్పుకోవాలి. ఇటువంటి ఘటన ఎవరికి జరిగినా నేను నిలబడతా.. వదిలిపెట్టను.

వీల్ చైర్ అడిగితే.. జైల్లో పెట్టిస్తానన్న ఇండిగో పైలట్!

ఓ ఇండిగో పైలట్ నిన్న చెన్నై-బెంగళూరు విమానంలో ప్రయాణికులపట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సోమవారం రాత్రి ఇండిగో విమానంలో ప్రయాణించిన సుప్రియ ఉన్ని నాయర్ ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఆమె తన 75 ఏళ్ల వయసుగల తల్లితో కలిసి బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. తన తల్లి మధుమేహంతో బాధపడుతున్నందువల్ల ఓ వీల్ చైర్‌‌లో కూర్చుండబెట్టి తీసుకెళ్లాలని అనుకున్నట్లు తెలిపారు. విమానం వద్దకు వీల్‌చైర్‌ను తీసుకొచ్చిన తర్వాత పైలట్‌ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. తల్లీకూతుళ్ళను ఒక రాత్రి జైలులో పెట్టిస్తానని బెదిరించారని పేర్కొన్నారు.

ఈ తెల్లవారుజామున ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక వివరణాత్మక ట్వీట్ లో, ఎంఎస్ నాయర్ జరిగిన సంఘటనను వివరించారు. ఈ కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కెప్టెన్ తనను భయంకరమైన పరిణామాలకు గురి చేస్తానని బెదిరించాడని ఆమె అన్నారు. మేము వీల్ చైర్ సహాయం కోరినందున మమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించారు అని ఆమె పేర్కొన్నారు. మహిళను బెదిరించిన ఇండిగో విమానం పైలట్‌ను విధులకు దూరంగా ఉంచారు. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ట్విట్టర్ ద్వారా స్పందించారు.

14/01/2020,7:02PM

Related Tags