అక్కడ 61 ప్రైవేటు ఆసుపత్రుల్లో.. 20 శాతం పడకలు కరోనా పేషెంట్లకే..

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పేషెంట్ల కోసం 61 ప్రైవేటు ఆసుపత్రుల్లో 20 శాతం పడకలను ప్రభుత్వం రిజర్వ్ చేస్తోందని

అక్కడ 61 ప్రైవేటు ఆసుపత్రుల్లో.. 20 శాతం పడకలు కరోనా పేషెంట్లకే..
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 6:17 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పేషెంట్ల కోసం 61 ప్రైవేటు ఆసుపత్రుల్లో 20 శాతం పడకలను ప్రభుత్వం రిజర్వ్ చేస్తోందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మంత్రి మాట్లాడుతూ, డాక్టర్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రి నుంచి సకాలంలో టెస్ట్ రిపోర్టులు రావడం లేదని ఆరోపించారు.

కాగా.. ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేరిన వారిలో 70 శాతం మంది 24 గంటల్లోనే మరణిస్తే, వారి టెస్ట్ రిపోర్టులు మాత్రం 5, 6 రోజులకు వస్తున్నాయన్నారు. ఇది సరైన పద్ధతి కాదని, 24 గంటల్లోనే రిపోర్టులు రావాలని అన్నారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రి నుంచి ఒక రోజు 94 శాతం శాంపుల్స్ పాజిటివ్ అని చెప్పగా, వాటిని రీటెస్ట్ చేయిస్తే 45 శాతం మందికే పాజిటివ్ అని తేలిందన్నారు. దీనికి బాధ్యులెవరో గుర్తించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఆయన కోరారు.

మరోవైపు.. ఢిల్లీ కోవిద్-19 యాప్ గురించి మంత్రి వివరిస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్ని పడకలు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయనే విషయమై ఎప్పటికప్పుడు అప్‌డేట్ సమాచారం కోసం యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇందుకోసం ఒక వెబ్ పేజీ కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినట్టు సత్యేంద్ర జైన్ చెప్పారు.

Also Read: టెన్త్ విద్యార్థుల కోసం.. నేటి నుంచి తెరుచుకోనున్న సంక్షేమ హాస్టళ్లు..