దేశంలో కరోనా విశ్వరూపం.. నెలరోజుల్లో కేసుల సంఖ్య.. గణనీయంగా 5 లక్షల వరకు..?

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. భారత్‌లో వచ్చే 30 రోజుల్లో కొవిడ్‌-19 బారిన పడే వారి సంఖ్యను అంచనా వేసేందుకు గువాహటి ఐఐటీ,

దేశంలో కరోనా విశ్వరూపం.. నెలరోజుల్లో కేసుల సంఖ్య.. గణనీయంగా 5 లక్షల వరకు..?
Follow us

| Edited By:

Updated on: May 11, 2020 | 11:23 AM

Coronavirus Situation In States: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. భారత్‌లో వచ్చే 30 రోజుల్లో కొవిడ్‌-19 బారిన పడే వారి సంఖ్యను అంచనా వేసేందుకు గువాహటి ఐఐటీ, సింగపూర్‌ డూక్‌-నుజ్‌ మెడికల్‌ స్కూల్‌ల సంయుక్త బృందం సరికొత్త నమూనా రూపొందించింది. దీని ప్రకారం దేశంలో వచ్చే నెల రోజుల్లో వైరస్‌ వ్యాప్తి మధ్యస్థంగా ఉంటే మొత్తం కేసులు 1.5 లక్షలకు చేరుతాయి. అదే విషమంగా వ్యాపిస్తే 5.5 లక్షలకు చేరతాయి.

మరోవైపు.. రాష్ట్రాల వారీగా కేసుల పెరుగుదల రేటు, రోజువారీ కేసుల నమోదు ప్రకారం ఈ లెక్కలు కట్టారు. ఇందులో రాష్ట్రాలను మూడు విభాగాలుగా గుర్తించారు. గత రెండు వారాలుగా రోజువారీ కేసుల్లో తగ్గుదల లేని రాష్ట్రాలను విషమ విభాగంగా పరిగణించారు. క్రియాశీల కేసుల సంఖ్య పెరుగుతున్నా గత రెండు వారాలుగా రోజువారీ కేసులు తగ్గుతున్న వాటిని మధ్యస్త విభాగంలోకి తీసుకున్నారు. మొత్తం క్రియాశీల కేసులతో పాటు రోజువారీగా నమోదయ్యే కేసులూ తగ్గుతుంటే నియంత్రణ విభాగంగా పరిగణించారు.

కాగా.. ‘వచ్చే నెల రోజుల్లో కేసుల అంచనా కోసం దేశం మొత్తాన్ని ఒకే తరహాలో చూస్తే సరైన లెక్క రాదు. కొత్త కేసుల పెరుగుదల రేటు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు తీసుకొనే నివారణ చర్యలు భిన్నంగా ఉంటాయి. అందుకే ప్రతి రాష్ట్రాన్ని విడిగా పరిగణించాలి. అప్పుడే అందుబాటులో ఉన్న పరిమిత వనరులను సమర్థంగా వినియోగించుకొనేందుకు ప్రభుత్వాలకు వీలవుతుంది.’ అని బృందం పేర్కొంది.

Latest Articles