లాక్ డౌన్ పొడిగింపు విఫలమైతే ? పీకే సూటి ప్రశ్న

లాక్ డౌన్ విధి విధానాలను దుయ్యబడుతున్న ఎన్నికల ప్రచార వ్యూహకర్త, రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్ మోదీ ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేశారు. లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగించినప్పటికీ.. ఫలితం లేకపోయిన పక్షంలో సర్కార్ కి మరో ప్లాన్ ఏదైనా ఉందా అని ప్రశ్నించారు.

లాక్ డౌన్ పొడిగింపు విఫలమైతే ? పీకే సూటి ప్రశ్న
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 14, 2020 | 6:20 PM

లాక్ డౌన్ విధి విధానాలను దుయ్యబడుతున్న ఎన్నికల ప్రచార వ్యూహకర్త, రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్ మోదీ ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేశారు. లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగించినప్పటికీ.. ఫలితం లేకపోయిన పక్షంలో సర్కార్ కి మరో ప్లాన్ ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. లేదా పరిస్థితిని సరిదిద్దుకోవాలన్న చిత్తశుద్ది అయినా ఉందా అన్నారు. లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగిస్తున్నామని, అదే సమయంలో వచ్ఛే ఏడు రోజుల్లో ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లాలో లాక్ డౌన్ ఖఛ్చితంగా అమలవుతోందా లేదా అన్నది పరిశీలిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1211 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకిన నేపథ్యంలోనూ, ఈ కేసుల సంఖ్య 10,363 కి పెరిగిన సందర్భంలోను ప్రధాని ఈ ప్రకటన చేశారు. కాగా-లాక్ డౌన్ విధి విధానాలు, హేతుబధ్దతపై అదే పనిగా.. నిర్విరామంగా డిబేట్ పెట్టడం అర్థ రహితమని, అసలైన ప్రశ్న.. మే 3 వరకు ఆంక్షలు పొడిగించినా.. ఆశించిన ఫలితం రాకపోతే ఏం చేయాలన్నదేనని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వానికి ఏదైనా ప్రత్యామ్నాయ యోచన ఏదైనా ఉందా… లేదా ఈ పరిస్థితిని చక్కదిద్దాలన్న అభిమతం గానీ (పకడ్బందీ ప్లాన్) ఉందా అన్నారాయన. ఈ వైరస్ ని ఎదుర్కొనేందుకు ఒక సమగ్రమైన   పాలసీ అంటూ లేకుండానే లాక్ డౌన్ ని ప్రభుత్వం ప్రజలమీద రుద్దుతోందని ఆయన ఇటీవలే నిప్పులు కక్కారు.