సేవింగ్ అకౌంట్స్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్..!

సేవింగ్స్‌ ఖాతాదారులకు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఐసీఐసీఐ షాక్ ఇచ్చింది. ఇక పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్న్లు పేర్కొంది. అంటే ఇక వడ్డీ రేట్లలో 0.25 శాతం తగ్గనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఐసీఐసీఐ వెల్లడించింది. ఇప్పటి వరకు రూ.50 లక్షల వరకు ఉన్న డిపాజిట్లు కలిగిన సేవింగ్‌ అకౌంట్స్‌పై 3.5 శాతం వడ్డీ చెల్లిస్తుంది. ఇప్పుడు సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం […]

సేవింగ్ అకౌంట్స్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్..!
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2020 | 8:11 AM

సేవింగ్స్‌ ఖాతాదారులకు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఐసీఐసీఐ షాక్ ఇచ్చింది. ఇక పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్న్లు పేర్కొంది. అంటే ఇక వడ్డీ రేట్లలో 0.25 శాతం తగ్గనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఐసీఐసీఐ వెల్లడించింది. ఇప్పటి వరకు రూ.50 లక్షల వరకు ఉన్న డిపాజిట్లు కలిగిన సేవింగ్‌ అకౌంట్స్‌పై 3.5 శాతం వడ్డీ చెల్లిస్తుంది. ఇప్పుడు సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం ఇక నుంచి 3.25 శాతం మాత్రమే చెల్లించనుంది. ఇదిలా ఉంటే.. రూ. 50 లక్షల నుంచి రెండు కోట్ల వరకు డిపాజిట్‌ చేసిన వారికి ప్రస్తుతం 4.00శాతం ఉంది. ఇప్పుడు ఇది కూడా 0.25 శాతం తగ్గి 3.75 శాతం వడ్డీ చెల్లించనుంది.