టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ ఏడో స్థానం.. కేఎల్‌రాహుల్‌ ఎన్నోస్థానంలో ఉన్నాడంటే..

టీమిండియా సారధి విరాట్ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. బుధవారం విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్నాడు.

టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ ఏడో స్థానం.. కేఎల్‌రాహుల్‌ ఎన్నోస్థానంలో ఉన్నాడంటే..
Follow us

|

Updated on: Dec 23, 2020 | 9:41 PM

టీమిండియా సారధి విరాట్ ఖాతాలో మరో ఘనత. మూడు ఫార్మెట్స్ లోనూ కోహ్లీ టాప్ 10లో ఉన్నాడు. బుధవారం విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్నాడు. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ కేఎల్‌రాహుల్‌ మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. కోహ్లీ  697 పాయింట్లు తో ఏడోస్థానంలో ఉండగా.. రాహుల్ 816 పాయింట్లు మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాట్స్‌మన్‌, బౌలర్లు, ఆల్‌రౌండర్ల కేటగిరీల్లో టాప్‌-10లో రాహుల్‌, కోహ్లీ ఇద్దరు మాత్రమే టాప్ 10లో ఉన్నారు. ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ డేవిడ్‌ మలన్ 915 ‌ పాయింట్లతో మొదటిస్థానంలో ఉన్నాడు. పాక్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ 820 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక విరాట్వ్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 ,స్థానంలో ఉండగా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇలా మూడు ఫార్మెట్స్ లో కోహ్లీ టాప్ 10 లో ఉన్నాడు.