మద్యం మత్తులో ఐఏఎస్ అధికారి బీభత్సం: జర్నలిస్ట్ మృతి

మద్యంమత్తులో ఓ ఐఏఎస్ అధికారి కారు నడిపి బీభత్సం సృష్టించాడు. మితిమీరిన వేగంతో కారు నడిపి.. ఓ జర్నలిస్ట్‌ని పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో త్రివేండ్రం మ్యూజియం వద్ద చోటు చేసింది. కేరళకు చెందిన శ్రీరామ్ వెంకటరామన్ అనే ఐఏఎస్ అధికారి.. బైక్‌పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో జర్నలిస్ట్ మహమ్మద్ బషీర్ (35) మృతి చెందారు. మృతుడు మహమ్మద్ బషీర్.. ‘సిరాజ్‌’ అనే ప్రముఖ మలయాళ పత్రికకు బ్యూరో చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.

మితిమీరిన వేగంతో కారు నడిపి బైక్‌ని ఢీకొట్టడంతో 100 మీటర్ల దూరంలో బైక్ ఎగిరిపడింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. మహమ్మద్ బషీర్ మరణం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *