సంగారెడ్డి జైల్లో హైడ్రోఫోనిక్‌ ఫార్మింగ్‌..

తెలంగాణ జైళ్లలో నవశకం ఆరంభమైందని చెప్పవచ్చు. జైలంటే కేవలం ఖైదీలకు శిక్షలు విధించటం మాత్రమే కాదు..వారిలో సత్ప్రవర్తన,  సామాజిక స్పృహా, మానవతా దృక్పథంతో పాటు వారు బయటికి వెళ్లిన తర్వాత కూడా స్వయం ఉపాధితో జీవించేలా భరోసా కల్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కోజైల్లో ఒక్కో విధమైన విభిన్న కార్యాచరణను అమలు చేస్తున్నారు అధికారులు. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా జైలు ఎన్నో కొత్త సంస్కరణలను అమలుచేస్తున్నప్పటికీ, తాజాగా మరో ఆలోచనతో ఇతర జైళ్లకు ఆదర్శంగా నిలుస్తుంది. […]

సంగారెడ్డి జైల్లో హైడ్రోఫోనిక్‌ ఫార్మింగ్‌..
Follow us

|

Updated on: Dec 13, 2019 | 8:03 PM

తెలంగాణ జైళ్లలో నవశకం ఆరంభమైందని చెప్పవచ్చు. జైలంటే కేవలం ఖైదీలకు శిక్షలు విధించటం మాత్రమే కాదు..వారిలో సత్ప్రవర్తన,  సామాజిక స్పృహా, మానవతా దృక్పథంతో పాటు వారు బయటికి వెళ్లిన తర్వాత కూడా స్వయం ఉపాధితో జీవించేలా భరోసా కల్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కోజైల్లో ఒక్కో విధమైన విభిన్న కార్యాచరణను అమలు చేస్తున్నారు అధికారులు. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా జైలు ఎన్నో కొత్త సంస్కరణలను అమలుచేస్తున్నప్పటికీ, తాజాగా మరో ఆలోచనతో ఇతర జైళ్లకు ఆదర్శంగా నిలుస్తుంది. వివరాల్లోకి వెళితే..

జిల్లా జైల్లో కొత్తగా హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ విధానం మొదలు పెట్టారు ఇందులో భాగంగా పౌష్టికాహారం కోసం కావాల్సిన ఆకుకూరలు, కూరగాయల్ని పండించడం నేర్పిస్తున్నారు. ఖైదీలకు కావాల్సిన ఆకు కూరల కోసం బయటకు వెళ్లకుండా నూతన విధానంలో అక్కడే పండిస్తూ వారికి మెలకువలు నేర్పిస్తున్నారు. ఈ పద్ధతిలో పంటలు పండించటానికి మట్టి అవసరం లేదు. ఎక్కువ స్థలం అవసరం లేదు. నీటి వినియోగం కూడా తక్కువగానే ఉంటుంది. మొదటగా సీడ్‌ ట్రాక్‌ లోని కొబ్బరి పీచు పొడిలో విత్తనాల్ని మొలకెత్తిస్తారు. తర్వాత పీవీసీ పైపులతో ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రోఫోనిక్‌ ఫార్మింగ్‌ సిస్టమ్లోని చిన్న జాలి తొట్టిలు, వస్తువుల్లో మొక్కల్ని పెంచుతారు.
ఎక్కువ మోతాదులో మట్టి అవసరం లేకుండా వాటిలో రాళ్లు నింపి ప్రత్యేక పద్దతులు అవలంభిస్తారు. మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలను మ్యాక్రో సొల్యూషన్, మైక్రో ద్రావణాలు అందించి వాటిని పెంచుతారు. దీని ద్వారా ఆర్గానిక్ ఆకుకూరలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి విధానం వల్ల ఖైదీలు విడుదల అయిన తర్వాత ఉపాధిగా కూడా ఉంటుందని జైలు సూపరింటెండెంట్ శివకుమార్ తెలిపారు. అంతేకాదు, ఖైదీల మనస్తత్వాన్ని అంచనా వేసేందుకు గానూ, ఎప్పటికప్పుడ సైక్రియాటిస్టులతోనూ అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు.