తమిళనాట వర్ష బీభత్సం.. అరటిపంటకు తీవ్రనష్టం.. చిక్కుకుపోయిన మూగజీవాలు

తెలుగురాష్ట్రాలనేకాదు పక్కనున్న తమిళనాడుని కూడా భారీ వర్షాలు గడగడలాడిస్తున్నాయి. నాలుగురోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తోంది. ధర్మపురి, క్రిష్ణగిరి, ఈరోడ్, సేలం, వెల్లూర్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈరోడ్ జిల్లాలో వర్షాలకు పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. పలు గ్రామాల్లో పంటనష్టం తీవ్రంగా ఉంది. వందల ఎకరాల్లో ఉన్న అరటితోట వర్షాల కారణంగా పూర్తిగా నాశనం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. సత్యమంగళం ఆటవీ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు సక్కరై వంతెన వరదనీటితో పూర్తిగా నిండిపోయింది. దీంతో […]

తమిళనాట వర్ష బీభత్సం.. అరటిపంటకు తీవ్రనష్టం.. చిక్కుకుపోయిన మూగజీవాలు
Follow us

|

Updated on: Oct 12, 2020 | 9:48 AM

తెలుగురాష్ట్రాలనేకాదు పక్కనున్న తమిళనాడుని కూడా భారీ వర్షాలు గడగడలాడిస్తున్నాయి. నాలుగురోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తోంది. ధర్మపురి, క్రిష్ణగిరి, ఈరోడ్, సేలం, వెల్లూర్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈరోడ్ జిల్లాలో వర్షాలకు పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. పలు గ్రామాల్లో పంటనష్టం తీవ్రంగా ఉంది. వందల ఎకరాల్లో ఉన్న అరటితోట వర్షాల కారణంగా పూర్తిగా నాశనం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. సత్యమంగళం ఆటవీ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు సక్కరై వంతెన వరదనీటితో పూర్తిగా నిండిపోయింది. దీంతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీటిలో వంతెన దాటే ప్రయత్నం చేసిన మూగజీవాలు నీటిలో చిక్కుకున్నాయి. బస్సు రవాణా నిలిచిపోవడంతో అటవీ గ్రామాలలో చిక్కుకున్న ప్రజలు కనీస వసతులు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వ యాంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నారు.