Dance in Police Station: ఠాణాలో మన్మథుడు.. స్టెప్పులేసి పోలీస్ స్టేషన్ డాన్స్ క్లబ్‌గా మార్చేసిన జెడ్పీటీసీ భర్త

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ జెడ్పీటీసీ భర్త నిర్వాకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొట్టి నిక్కర్‌తో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళా జెడ్పీటీసీ భర్త ఒరోరి అందగాడా.. నీకోసం.. నీ కోసం.. అనే పాటకు స్టెప్పులేసి పోలీస్ స్టేషన్ డాన్స్ క్లబ్‌గా మార్చేశాడు. అయన డాన్స్ చేస్తుంటే వీడియోలు తీసిన పోలీస్ సిబ్బంది మరింత ఎంకరేజ్ చేయడం కొసమెరుపు..!

Dance in Police Station: ఠాణాలో మన్మథుడు.. స్టెప్పులేసి పోలీస్ స్టేషన్ డాన్స్ క్లబ్‌గా మార్చేసిన జెడ్పీటీసీ భర్త
Dance In Police Station
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 15, 2024 | 9:57 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ జెడ్పీటీసీ భర్త నిర్వాకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొట్టి నిక్కర్‌తో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళా జెడ్పీటీసీ భర్త ఒరోరి అందగాడా.. నీకోసం.. నీ కోసం.. అనే పాటకు స్టెప్పులేసి పోలీస్ స్టేషన్ డాన్స్ క్లబ్‌గా మార్చేశాడు. అయన డాన్స్ చేస్తుంటే వీడియోలు తీసిన పోలీస్ సిబ్బంది మరింత ఎంకరేజ్ చేయడం కొసమెరుపు..! ఈ ఘటన అత్యంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

స్థానిక జెడ్పీటీసీ గుండాల అరుణ భర్త శ్రీనివాస్ మార్నింగ్ వాక్ అనంతరం అదే పొట్టి నిక్కర్ తో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. పోలీస్ సిబ్బందితో కాసేపు సరదాగా గడిపిన ఆయన సెల్ ఫోన్ లో నీ కోసం.. నీ కోసం అంటూ సినిమా పాటలకు తనను తాను మై మరచిపోయి డాన్సులు వేశాడు. ఆయన స్టెప్పులేస్తుంటే పోలీస్ సిబ్బంది చప్పట్లు చర్పించి ప్రోత్సహించడంతో మరింత రెచ్చిపోయారు. దీంతో పోలీస్ స్టేషన్ కాస్త డాన్సింగ్ క్లబ్‌గా మారిపోయింది. ఏకంగా పోలీసులే ఈ వీడియో తీసుకుని ఏదో ఘనకార్యం చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో దీనిపై విచారణ చేపట్టారు.

అయితే పొట్టినిక్కర్‌తో పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేసిన జెడ్పీటీసీ అరుణ భర్త శ్రీనివాస్ మాత్రం అందులో తప్పేముంది. అలా పాటలతో డ్యాన్స్ చేయడం ఒకరకమైన వ్యాయామం అంటున్నారు. ఏరోబిక్స్ కూడా ఇలాగే పాటలకు డాన్స్ రూపంలో వ్యాయమం చేస్తుంటారని అందులో తప్పేమీ లేదని తనను సమర్థించుకున్నాడు. ఏదైతేనేం.. చివరికి అతగాడి వీడియో నెట్టింగ వైరల్ అవుతుండటంతో విచారణ చేపట్టారు జిల్లా పోలీసులు.

హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్.. ఎస్ఐ బదిలీ

మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఉదయం ఓ రాజకీయ పార్టీ నేత డాన్స్ చేసిన ఘటనలో పోలీస్ స్టేషన్ ఇంచార్జిగా ఉండి, విధి నిర్వహణలో అలసత్వం విధుల్లో నిర్లక్ష్యం వహించిన హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాఎస్పీ కిరణ్ ఖరే ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ ఘటనలో మహాదేవ్ పూర్ ఎస్ హెచ్ఓ ప్రసాద్ ను మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ నుండి వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ, ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ