అగ్రరాజ్యం అమెరికాకి ఆ రెండు జీవులు ఎందుకంత స్పెషల్.. ఏంటా స్టోరీ ??

సాధారణంగా ప్రతి దేశానికీ తమ సంస్కృతిని, బలాన్ని, చరిత్రను ప్రతిబింబించేలా ఓ జాతీయ జంతువు ఉంటుంది. మన దేశానికి పెద్దపులి ఉన్నట్లే, ఇతర దేశాలకు సింహం, పాండా, కంగారూ వంటివి జాతీయ చిహ్నాలుగా ఉన్నాయి. అయితే అగ్రరాజ్యం అమెరికా విషయంలో రెండు వేర్వేరు జీవులకు జాతీయ స్థాయి గుర్తింపు ఇచ్చింది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..

అగ్రరాజ్యం అమెరికాకి ఆ రెండు జీవులు ఎందుకంత స్పెషల్.. ఏంటా స్టోరీ ??
United States Dual National Symbols

Updated on: Nov 28, 2026 | 10:19 PM

సాధారణంగా ప్రతి దేశానికీ తమ సంస్కృతిని, బలాన్ని, చరిత్రను ప్రతిబింబించేలా ఓ జాతీయ జంతువు ఉంటుంది. మన దేశానికి పెద్దపులి ఉన్నట్లే, ఇతర దేశాలకు సింహం, పాండా, కంగారూ వంటివి జాతీయ చిహ్నాలుగా ఉన్నాయి. అయితే అగ్రరాజ్యం అమెరికా విషయంలో మాత్రం ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలకు ఒకటే జాతీయ జంతువు ఉంటే.. అమెరికా మాత్రం రెండు వేర్వేరు జీవులకు జాతీయ స్థాయి గుర్తింపు ఇచ్చింది. అవేంటి ? అందుకు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం..

ఇవే ఆ జీవులు..?

అగ్రరాజ్యం అమెరికా జాతీయ స్థాయి గుర్తింపు ఇచ్చిన జీవులలో ఒకటి భూమిపై గంభీరంగా నడిచే భారీ క్షీరదం కాగా.. మరొకటి ఆకాశంలో ఎంతో ఠీవీగా విహరించే శక్తివంతమైన పక్షి. అవే ‘అమెరికన్ బైసన్’ (American Bison), ‘బాల్డ్ ఈగిల్’ (Bald Eagle). వీటిని ఒకే కేటగిరీలో కాకుండా.. బైసన్‌కు జాతీయ క్షీరదంగా (National Mammal).. బాల్డ్ ఈగిల్‌కు జాతీయ పక్షిగా (National Bird) చట్టబద్ధమైన హోదా కల్పించారు.

కారణం ఇదే..?

ఈ రెండు జీవులు అమెరికా సంస్కృతిలో, ప్రజల జీవన విధానంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. పూర్వకాలం నుంచే స్థానిక అమెరికన్ ఆదివాసీ తెగలు బైసన్‌ను ఎంతో పవిత్రంగా పూజించేవి. వారి ఆహారం, దుస్తులు, గుడారాల తయారీ నుంచి పనిముట్ల వరకు ప్రతి అవసరానికీ బైసన్ ఆధారంగా ఉండేది. అందుకే ఇది అమెరికా ప్రకృతి సంపదకు, ప్రాచీన వారసత్వానికి ప్రతీకగా నిలిచింది. మరోవైపు బాల్డ్ ఈగిల్ అమెరికన్ల స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ధైర్యానికి నిదర్శనంగా భావిస్తారు. అమెరికా కరెన్సీ నాణేలు, పాస్‌పోర్టులు, సైనిక చిహ్నాలు, ప్రభుత్వ పత్రాలపై ఈ పక్షి బొమ్మ తప్పనిసరిగా కనిపిస్తుంది. దేశ అధికారిక ముద్రలో ఈ పక్షి ఒక కాలిలో శాంతికి చిహ్నమైన ఆలివ్ కొమ్మను, మరో కాలిలో యుద్ధ సన్నద్ధతకు ప్రతీకైన బాణాలను పట్టుకుని ఉంటుంది.

United States Dual National Symbols

అమెరికన్ బైసన్..

ఉత్తర అమెరికా ఖండంలోనే అతిపెద్ద భూచర క్షీరదం అమెరికన్ బైసన్. దీన్ని సాధారణంగా అమెరికన్ బఫెలో అని కూడా పిలుస్తారు. మగ బైసన్ ఏకంగా 900 కిలోల వరకు బరువు పెరుగుతుంది. భుజాలపై ఎత్తైన మూపురం, దట్టమైన వెంట్రుకలతో చూడటానికి ఎంతో గంభీరంగా కనిపిస్తుంది. ఇంత భారీ శరీరం ఉన్నా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలగడం, ఎంతటి గడ్డకట్టే చలినైనా తట్టుకుని నిలబడటం దీని ప్రత్యేకత. ఒకప్పుడు అమెరికాలోని విశాలమైన గడ్డి మైదానాల్లో సుమారు మూడు కోట్ల బైసన్లు సంచరించేవి. కానీ 19వ శతాబ్దంలో విచ్చలవిడి వేట కారణంగా వాటి సంఖ్య వందల్లోకి పడిపోయింది. వీటి చారిత్రక ప్రాధాన్యతను గుర్తిస్తూ 2016 మే 9న అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రత్యేక చట్టంపై సంతకం చేసి, బైసన్‌కు అధికారిక జాతీయ క్షీరదం హోదా కల్పించారు.

బాల్డ్ ఈగిల్..

తెల్లటి తల, తోక, ముదురు గోధుమ రంగు శరీరం, పదునైన పసుపు ముక్కుతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే పక్షి బాల్డ్ ఈగిల్. ఇది రెక్కలు విప్పితే దాదాపు రెండున్నర మీటర్ల వెడల్పు ఉంటాయి. బలమైన కాళ్లు, పదునైన గోళ్లతో నీటిలోని చేపలను సైతం వేటాడగలదు. చెట్లపై భారీ గూళ్లు కట్టుకుని, అడవిలో సుమారు 30 ఏళ్ల వరకు జీవిస్తుంది. బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత 1782లో అమెరికా తన అధికారిక ముద్ర (గ్రేట్ సీల్)లో బాల్డ్ ఈగిల్‌ను చేర్చింది. అయితే వందల ఏళ్లుగా దేశ చిహ్నంగా ఉన్నప్పటికీ, దీనికి అధికారిక జాతీయ పక్షి హోదా మాత్రం రాలేదు. 2024 డిసెంబర్ 23న అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేక చట్టంపై సంతకం చేయడంతో బాల్డ్ ఈగిల్‌కు చట్టబద్ధంగా జాతీయ పక్షి గుర్తింపు దక్కింది.

Loading...
Unable to load recommendations.
Follow Us