Hotels: ఒక్క రోజుకు రూ. 80 లక్షలు.. ప్రపంచంలో టాప్‌ హోటల్స్‌ ఇవే..

అయితే సాధారణంగా మనకు తెలిసినంత వరకు హోటల్‌లో ఒక రోజు స్టే చేస్తే ఎంత ఖర్చవుతుంది.? ఏముందు మహా అయితే ఓ రూ. పదివేలు, ఇంకా ఎక్కువంటే రూ. 20 వేలు అంటారా.? అయితే ఓ హోటల్‌లో మాత్రం ఒక్క రోజు స్టే చేయాలంటే ఏకంగా రూ. 83 లక్షలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి హోటల్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి.? అలాంటి కొన్ని కాస్లీ హోటల్స్‌ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు...

Hotels: ఒక్క రోజుకు రూ. 80 లక్షలు.. ప్రపంచంలో టాప్‌ హోటల్స్‌ ఇవే..
Costly Hotels
Follow us

|

Updated on: Jul 20, 2024 | 6:20 PM

హోటల్‌ బిజినెస్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. పర్యాటకం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హోటల్‌ వ్యాపారం ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. హోటల మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. హోటల్స్‌ రంగంలో భారీగా లాభాలు ఉండడం, డిమాండ్‌ ఉండడంతో పెద్ద పెద్ద సంస్థలు సైతం ఇందులో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక పలువురు సినీ, క్రీడా ప్రముఖులు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే సాధారణంగా మనకు తెలిసినంత వరకు హోటల్‌లో ఒక రోజు స్టే చేస్తే ఎంత ఖర్చవుతుంది.? ఏముందు మహా అయితే ఓ రూ. పదివేలు, ఇంకా ఎక్కువంటే రూ. 20 వేలు అంటారా.? అయితే ఓ హోటల్‌లో మాత్రం ఒక్క రోజు స్టే చేయాలంటే ఏకంగా రూ. 83 లక్షలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి హోటల్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి.? అలాంటి కొన్ని కాస్లీ హోటల్స్‌ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రపంచంలో అత్యంత కాస్లీ హోటల్స్‌లో అట్లాంటిస్‌ ది రాయల్‌ హోటల్ ఒకటి. దుబాయ్‌లో ఉన్న ఈ హోటల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, ధనవంతులు వస్తుంటారు. ఈ హోటల్‌లో ఒక్క రోజు స్టే చేయాలంటే అక్షరాల 100000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మన కర్సెన్సీలో చెప్పాలంటే రూ. 83 లక్షలు. పేరుకు తగ్గట్లుగానే ఇందులో అన్ని రాయల్ సేవలను అందిస్తారు.

* ఇక ప్రపంచంలో అత్యంత కాస్లీ హోటల్స్‌లో రాజ్‌ ప్యాలెస్‌ కూడా ఒకటి. ఇది భారత్‌లోఏ ఉంది. జైపూర్‌లో ఉన్న ఈ హోటల్‌లో ఒక్క రోజు స్టే చేయాలంటే రూ. 14 లక్షలు చెల్లించాల్సిందే. ఈ హోటల్‌లో ప్రారంభ ధర రూ. లక్షగా ఉన్నా. ప్రెసిడెన్షియల్ సూట్‌లో ఉండాలంటే మాత్రం రూ. 14 లక్షలు చెల్లించాల్సిందే.

* ప్రపంచంలో అత్యంత లగ్జరీ హోటల్స్‌లో హోటల్ ప్రెసిడెంట్ విల్సన్ ఒకటి. ఇది స్విట్జర్లాండ్‌లో ఉంది. ఇక్కడ ఒక్క రాత్రి స్టే చేయాలంటే ఏకంగా రూ. 38 లక్షలు చెల్లించాల్సిందే. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ధనవంతులు ఈ హోటల్‌లో స్టే చేస్తుంటారు.

* అమెరికాలోని ది మార్క్‌ హోటల్‌ కూడా ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్స్‌లో ఒకటి. ఈ హోటల్‌లో ఒక్క రోజు ఉండాలంటే రూ. 55 లక్షలు చెల్లించాలి. ఇందులో ఉండే సదుపాయాలు అలా ఉంటాయి మరి.

* అత్యంత ఖరీదైన హోటల్స్‌ జాబితాలో చైనా కూడా ముందంజలో ఉంది. చైనాలోని రిట్జ్-కార్ల్టన్ అత్యం కాస్లీ హోటల్స్‌లో ఒకటి. ఈ హోటల్‌లో ఒక్క రాత్రి ఉండాలంటే రూ. 35 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Weekly Horoscope: వారి కుటుంబంలో ఓ శుభ పరిణామం పక్కా..
Weekly Horoscope: వారి కుటుంబంలో ఓ శుభ పరిణామం పక్కా..
మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..
మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..
ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఎంపీలతో కీలక చర్చ
ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఎంపీలతో కీలక చర్చ
పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. మొత్తం లాగించేస్తారు..
పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. మొత్తం లాగించేస్తారు..
కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ
కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ
బంక లడ్డూలు.. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!
బంక లడ్డూలు.. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!
సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..
సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..
ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..
ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..
టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..
టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..
తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??
తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??