లెమన్ కాఫీ తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Jyothi Gadda

20 July 2024

చాలా మంది లెమన్ వాటర్ ను ఉదయాన్నే పరిగడుపున తాగుతుంటారు. ఈ వాటర్ బరువును తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. కడుపు ఆరోగ్యంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.

 కానీ చాలా మంది లెమన్ వాటర్ ను కేవలం బరువు తగ్గడానికి మాత్రమే తాగుతారు. నిజానికి లెమన్ వాటర్ కేలరీలను కరిగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

నిమ్మకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. 

శరీరంలో ఉన్న విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లెమన్ వాటర్ కాకుండా.. మీరు లెమన్ కాఫీని తాగినా కూడా ఆరోగ్యంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

లెమన్ కాఫీని రోజూ తాగితే మీ ఆకలి చాలా వరకు నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగించి మీ బరువును తగ్గిస్తుంది. 

ఒక్క ఎండాకాలంలోనే కాదు వానాకాలం, చలికాలంలో కూడా మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. లేదంటే శరీరం డీహైడ్రేషన్ బారిన పడి ఎన్నో వ్యాధులు వస్తాయి. 

ఈ వానాకాలంలో మీ బాడీని హైడ్రేట్ గా ఉండాలనుకుంటే రోజూ లెమన్ కాఫీని తాగాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. కానీ, మీరు లెమన్ జ్యూస్‌ను బ్లాక్ కాఫీకి మాత్రమే యాడ్‌ చేసుకోవాలి పాలకి కాదు.

సగం నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఒక కప్పు వేడి నీళ్లు.. దీన్ని తయారుచేయడానికి ముందుగా ఒక గ్లాసులో నిమ్మరసం తీసుకుని అందులో కాఫీ పొడి, గోరువెచ్చని నీళ్లు పోసి బాగా కలపండి.