డయాబెటిస్‌తో బాధపడేవారికి వంకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని చక్కెర్ల (గ్లోకోజ్) స్థాయిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా వంకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని పిండి పదార్థాలు, ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయి.
గుండె సంబందిథ సమస్యలు రాకుండా ఉంచడంలో వంకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా వంకాయ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. శరీరానికి అందే కెలోరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు వంకాయలు ఉపయోగపడతాయి
వంకాయంలో ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతాయి. ఎముకలు దృఢంగా మార్చడంలో సహాయపడతాయి.
వంకాయలోని యాంటీఆక్సిడెంట్లు ,మాంగనీస్ క్యాన్సర్ కణాలను అరిట్టడంలో ఉపయోగపడతాయి. భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే వంకాయ తీసుకోవాల్సిందే.
రక్త హీనతతో బాధపడేవారికి వంకాయ దివ్యౌషధంగా చెప్పొచ్చు. ఇందులోని ఐరన్ కంటెట్ రక్తహీనతను నివారిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగడంలో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.