ప్రైవేటు పార్ట్‌ నొప్పిగా ఉందంటూ అస్పత్రికొచ్చిన వ్యక్తి.. డాక్టర్లు టెస్ట్ చేయగా..

|

Oct 26, 2022 | 2:01 PM

ఓ వ్యక్తి ప్రైవేటు పార్ట్‌లో నొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్లాడు. డాక్టర్లు అతడికి టెస్ట్ చేయగా.. దెబ్బకు మైండ్ బ్లాంక్ అయ్యారు.

ప్రైవేటు పార్ట్‌ నొప్పిగా ఉందంటూ అస్పత్రికొచ్చిన వ్యక్తి.. డాక్టర్లు టెస్ట్ చేయగా..
Shocking Incident
Follow us on

ఓ వ్యక్తి ప్రైవేటు పార్ట్‌లో నొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్లాడు. డాక్టర్లు అతడికి టెస్ట్ చేయగా.. దెబ్బకు మైండ్ బ్లాంక్ అయ్యారు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. నార్త్-ఈస్ట్ చైనాలోని టైయున్‌లో వింత ఘటన జరిగింది. 43 ఏళ్ల వ్యక్తి తన ప్రైవేటు పార్ట్ నొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్లు దెబ్బకు షాక్ అయ్యారు. అతడి ప్రైవేటు పార్ట్‌పై 5.5 అంగుళాల పొడవైన కొమ్ము లాంటిది ఒకటి ఎదగడాన్ని గుర్తించారు. గతంలో ఇలాగే వస్తే.. డాక్టర్లు దాన్ని ఆపరేషన్ చేసి తీసేశారు. అయితే మరోసారి అదే ప్రాంతంలో కొమ్ము పెరగడం.. ఈసారి మునపటి కంటే భారీ సైజ్‌లో ఉండటంతో డాక్టర్లు దెబ్బకు షాక్ అయ్యారు.

క్యాన్సర్‌‌గా పరిగణిస్తోన్న డాక్టర్లు ఆ కొమ్మును కట్ చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యవంతంగా ఉన్నాడని.. ఇకపై కొమ్ములాంటిది పెరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని డాక్టర్లు అన్నారు. గత మూడు దశాబ్దాలలో ఆరుసార్లు ఇలాంటి వింత ఘటనలు చోటు చేసుకున్నాయి. కెరాటిన్ అనే కాంపౌండ్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని.. ఆ కొమ్ము బాగా ముదిరిపోయి చర్మం కింద నుంచి మూత్రనాళం దాటి విస్తరించింది.

రోగికి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు సోకినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని డాక్టర్లు చెప్పారు. 1990వ సంవత్సరం నుంచి పరిశీలిస్తే.. ఇలాంటి కేసులు కేవలం ఐదు మాత్రమే నమోదయ్యాయని అన్నారు. కాగా, ఇందుకు సంబంధించిన అధ్యయనం ఏషియన్ జర్నల్ ఆఫ్ సర్జరీలో ప్రచురించబడింది.