Optical Illusion Test: మీ ప్రతిభకు సవాల్.. ఈ చిత్రంలో దాగున్న జింకను 10 సెకన్లలో కనిపెట్టగలరా..?

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి.. ఇవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకంటాయి. అలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు ఒకటి.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు మన మెదడును మోసగించడంలో ముందుంటాయి. వీటిలో ఎన్నో విషయాలు దాగుంటాయి.. కానీ.. గుర్తించడం అంత ఈజీ కాదు..

Optical Illusion Test: మీ ప్రతిభకు సవాల్.. ఈ చిత్రంలో దాగున్న జింకను 10 సెకన్లలో కనిపెట్టగలరా..?
Optical Illusion

Updated on: Dec 03, 2025 | 8:31 PM

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి.. ఇవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకంటాయి. అలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు ఒకటి.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు మన మెదడును మోసగించడంలో ముందుంటాయి. వీటిలో ఎన్నో విషయాలు దాగుంటాయి.. కానీ.. గుర్తించడం అంత ఈజీ కాదు.. చాలా మంది తమ తెలివితేటలు, కంటి చురుకుదనం, పరిశీలన నైపుణ్యాలను పరీక్షించుకోవడానికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ ఫొటోల వైపు మొగ్గు చూపుతారు. వారికి కొంత ఖాళీ సమయం దొరికినప్పుడల్లా, వారు అలాంటి పజిల్స్ పరిష్కరించడానికి తమ సమయాన్ని వెచ్చిస్తారు. మీ ఆలోచనా శక్తిని సవాలు చేసే ఇలాంటి పజిల్‌ను మీ ముందుకు తీసుకువచ్చాం.. అయితే.. ఇది పరిష్కరించడం పెద్ద సవాలే.. ఈ చిత్రంలో, అటవీ ప్రాంతంలోని పొదల మాటు దాక్కున్న జింకను కనుగొనాలి.. ఇంకెందుకు ఆలస్యం.. ట్రై చేయండి..

ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో గురించి..

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ రెడ్డిట్ ఖాతా r/FindTheSniperలో షేర్ చేశారు.. మీరు ఈ చిత్రాన్ని మొదటిసారి చూసినప్పుడు, మీరు ఎండిన పొదలు, నేలపై పడిన ఎండిన ఆకులను చూడవచ్చు.. మొత్తానికి అటవీ ప్రాంతం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఈ దృశ్యంలో, ఒక జింక కూడా ఉంది.. కానీ.. అది పొదల మాటున దాక్కుని ఉంది.. ఈ జంతువును గుర్తించడానికి మీరు చాలా జాగ్రత్తగా చూడాలి.. మీకు పది సెకన్లు మాత్రమే ఉన్నాయి. ఈ జంతువును కనుగొనడానికి ప్రయత్నించండి.

Optical Illusion Test

ఆ వైరల్ పోస్ట్ ని ఇక్కడ చూడండి..

Deer
byu/uNki23 inFindTheSniper

మీరు జింకను కనుగొన్నారా..?

ఈ పజిల్ చిత్రాలు మీ కళ్ళను మోసం చేయడం ఖాయం. ఈ జింక పూర్తిగా పొదల్లో దాగి ఉండటం వల్ల దాన్ని గుర్తించడం కొంచెం కష్టం.. జింక పొదలలో కలిసి పోయింది.. కావున.. మీరు నిశితంగా గమనించి జింక ఎక్కడ ఉందో కనుక్కోవాలి. ఈ రెడ్డిట్ పోస్ట్‌లోని వ్యాఖ్యల ఆధారంగా, జింక మీ దృష్టిని ఆకర్షిస్తుందో లేదో చూడండి.

ఇంకా జింకను కనుగొనలేకపోతే.. ఈ కింద ఇచ్చిన ఫొటోను చూడండి..

Optical Test

ఇది కూడా చదవండి..

Photo Puzzle: కాస్కో నా వాస్కోడిగామా.. 15 సెకన్లే టైం.. ఈ ఫోటోలో ఎలుక ఎక్కడుందో గుర్తించగలరా?