
సోషల్ మీడియాలో తరచూ వైరల్‌గా మారే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లకు, మొదడుకు పని చెప్పడమే కాకుండా.. మన పరిశీలనా నైపుణ్యాలు, ఏకాగ్రతను పెంచుతాయి. అందుకే ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతారు. మీకు కూడా ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసే అలవాటు ఉంటే.. మీకు ఒక సవాల్ ఉంది. చెట్టు కొమ్మపై చిరుతపులి విశ్రాంతి తీసుకుంటున్న ఈ చిత్రంలో దాగి ఉన్న చేపను 10 సెకన్లలో కనిపెట్టండి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అప్టికల్ ఇల్యూషన్ చిత్రం మిమ్మల్ని కాస్త గందరగోళానికి గురిచేయవచ్చు. ఎందుకంటే ఈ చిత్రాన్ని మీరు మొదటగా చూసినప్పుడు అందులో మీకు కేవలం చెట్టు కొమ్మమీద విశ్రాంతి తీసుకుంటున్న చిరుత పులి మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ చెట్టుకొమ్మల మధ్యన ఒక చేప కూడా దాగి ఉంది. కాబట్టి మీరు ఈ సవాల్‌ను స్వీకరిస్తునట్లయితే మీ పరిశీలన నైపుణ్యాలను ఉపయోగించి ఈ చెట్టుకొమ్మల మధ్య దాగి ఉన్న చేపను పది సెకన్లలో కనుగొనండి. మీరు ఈ చిత్రాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే ఈజీగా సమాధానం కనిపెట్టవచ్చు
మీరు 10 సెకన్లలోపు ఈ చిత్రంలో దాగి ఉన్న చేపను కనుగొంటే, మీకు అభినందనలు! ఒక వేళ కనిపెట్టకపోయినా మీరు చింతించకండి. ఎందుకంటే మేము సమాధానాన్ని రెడ్ కలర్ సర్కిల్‌లో ఉంచాము. అక్కడ మీరు చేపను గుర్తించవచ్చు.