Crow: మీకు కాకులు ఈ విధంగా కలలో వస్తే ఏం జరుగుతుంది..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?

Crow: మీకు కాకులు ఈ విధంగా కలలో వస్తే ఏం జరుగుతుంది..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?

Crow: సనాతన సంప్రదాయంలో పంచాంగం నుంచే కాకుండా జంతువులు, పక్షులకు సంబంధించిన శకునాల ద్వారా కూడా శుభ, అశుభ ముహూర్తాలను తెలుసుకునే సంప్రదాయం..

Subhash Goud

|

Jan 01, 2022 | 12:44 PM

Crow: సనాతన సంప్రదాయంలో పంచాంగం నుంచే కాకుండా జంతువులు, పక్షులకు సంబంధించిన శకునాల ద్వారా కూడా శుభ, అశుభ ముహూర్తాలను తెలుసుకునే సంప్రదాయం ఇప్పటికే ఉంది. ఒకానొక సమయంలో కాకులు రావణుడి తలపై వాలడం ప్రారంభించినప్పుడు అవి అతని వినాశనాన్ని సూచిస్తున్నట్లు పురాణాలలో ప్రస్తావించబడింది. ఒక వ్యక్తి జీవితంలో సంభవించే శుభ మరియు అశుభ సంకేతాలు ఇప్పటికే కనుగొనబడిన పురాతన గ్రంథాలలో ఇటువంటి అనేక ఉదాహరణలను చూస్తుంటాము. అలాగే నిద్రలో వచ్చే కొన్ని కలలు నిజమవుతాయని చాలా మంది నమ్ముతుంటారు. అలాగే తెల్లవారు జామున వచ్చే కలలకు చాలా ప్రాధాన్యత ఇ్తుంటారు. ఇక జంతువులు, పక్షులు కలలో వస్తే ఏదో ఒకటి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. ఇక కాకుల గురించి చూస్తే.. శకున్ శాస్త్రం ప్రకారం.. కాకి కూర్చోవడం, కొట్టుకోవడం, కలలోకి రావడం వంటివి జరిగితే శుభం జరుగుందా..? లేక అశుభం జరుగుతుందా? తెలుసుకోవచ్చు. అలాంటి కొన్ని ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం.

► ఒక కాకి ఆహారంతో ఎగిరితే అది కరువు సంకేతంగా భావిస్తారు. వ్యవసాయంలో నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు నమ్ముతారు. అటువంటి కాకిని చూసిన వారికి కూడా సమీప కాలంలో కొంత సంక్షోభం తప్పదని ఒక నమ్మకం.

► అలాగే ఎగిరే కాకి నోటి నుండి పసుపు లేదా తెలుపు రంగు మిఠాయిలు ఎవరికైనా పడితే అతను త్వరలో అందమైన స్త్రీని పొందుతాడని అర్థం

► కాకి మీ వద్దకు వచ్చి మాంసం ముక్కను పడవేస్తే అది అశుభం కాదు.. చాలా శుభప్రదం అని నమ్ముతారు. ఒక కాకి మాంసం ముక్కను పడేస్తే ఒక వ్యక్తి భవిష్యత్తులో డబ్బును పొందుతాడని నమ్ముతారు.

►అదేవిధంగా కాకికి బెల్లం లేదా వండిన అన్నం పెడితే ఇతరుల నుంచి రాని బకాయిలు తిరిగి వస్తాయని నమ్ముతారు.

► ఒక వ్యక్తి కలలో కాకి వలలో చిక్కుకున్నట్లు.. ఆయన వల నుంచి తప్పించుకున్నట్లు కల వస్తే మీరు శత్రువులపై విజయానికి సంకేతమని నమ్ముతారు.

► ఎగురుతున్న కాకుల గుంపులోంచి ఓ కాకి అతని వద్దకు వచ్చి తాను పెట్టిన పండును తిన్నట్లుగా కల వస్తే వారికి మంచి జరుగుతుంది. అలాంటి వ్యక్తులకు కుమారు జన్మించడం, లేదా అధిక సంపద లభించడం జరుగుతుందని నమ్మకం.

► మీ ఇంటి గోడ మీద కూర్చున్న కాకి ఉదయాన్నే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అరిచినట్లయితే త్వరలో మీ ఇంటికి అతిథి రాబోతున్నారని అర్థం చేసుకోవాలి.

(ఈ సమాచారం శాస్త్రీయ ఆధారాలు, జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారమే అందించబడుతుంది.)

ఇవి కూడా చదవండి:

Tirumala: ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల కొండలు

Astro Tips ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu