Personality Trait: మీ చేతి వేళ్ల పొడవుతో మీరెలాంటి వారో చెప్పేయొచ్చు.. ఆ రెండు కలిస్తే.!

మీ చేతి వేళ్ల పొడవును బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో మీకు తెలుసా.? చూపుడు వేలు, ఉంగరపు వేళ్ల పొడవు మీ స్వభావాన్ని ఎలా ప్రతిబింబిస్తాయో వివరంగా తెలుసుకోండి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి. ఆ వివరాలు ఏంటో ఇలా చూడండి.

Personality Trait: మీ చేతి వేళ్ల పొడవుతో మీరెలాంటి వారో చెప్పేయొచ్చు.. ఆ రెండు కలిస్తే.!
Fingers Personality

Updated on: Apr 29, 2026 | 11:38 AM

మన శరీరం మన గురించి ఎన్నో రహస్యాలను చెబుతుంది. అందులో మన చేతి వేళ్లు కూడా ఒకటి. కేవలం మన చేతి రేఖలే కాదు, మన వేళ్ల పొడవు కూడా మన వ్యక్తిత్వాన్ని, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో చెబుతాయని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.

ఉంగరపు వేలు, చూపుడు వేలు కంటే పొడవుగా ఉండటం

ఎవరికైతే ఉంగరపు వేలు పొడవుగా ఉంటుందో, వారు చాలా ఆకర్షణీయంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరు. అంతేకాకుండా, వీరు చాలా చొరవ తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అద్భుతమైన సంపాదన శక్తిని కలిగి ఉంటారని ఈ పరిశోధనలు చెబుతున్నాయి.

చూపుడు వేలు, ఉంగరపు వేలు కంటే పొడవుగా ఉండటం

చూపుడు వేలు పొడవుగా ఉన్నవారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. ప్రతీ పనిని ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. అయితే, వీరు కొన్నిసార్లు గర్వంగా లేదా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తులుగా ఇతరులకు కనిపిస్తుంటారు.

ఉంగరపు వేలు, చూపుడు వేలు సమానంగా ఉండటం

ఈ రెండు వేళ్లు సమాన పొడవు కలిగి ఉన్నవారు చాలా ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు గొడవలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతారు. వీరు చాలా నమ్మకస్థులుగా ఉంటారు. అయితే, వీరు ఒక్కసారి కోపం తెచ్చుకుంటే దాన్ని నియంత్రించడం కష్టం.

ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు అందే టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల ప్రభావం వల్ల కూడా వేళ్ల పొడవు మారుతుందని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. మన శరీర నిర్మాణం మన అంతర్గత స్వభావాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో వివరించారు. ప్రతీ ఒక్కరూ తమ చేతి వేళ్లను ఒకసారి పరిశీలించుకుంటే తమ గురించి తామే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. చివరగా, మన వేళ్ల పొడవు ద్వారా ఎదుటివారి మనస్తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక సరదా పరీక్షలా అనిపించినా, మనుషుల ప్రవర్తనను అంచనా వేయడానికి ఒక మార్గంగా పని చేస్తుంది. మన బలహీనతలు, బలాలు ఏమిటో తెలుసుకున్నప్పుడు మనం మరింత మెరుగ్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది.

ఇది చదవండి: సమ్మర్‌లో ఈ తప్పులు చేయకండి.. ఇవి పెడితే ఫ్రిడ్జ్ పేలిపోవడం ఖాయం..

Follow Us