Success Story: కేవలం 8 కత్త పొలంలో కూరగాయలు పండిస్తూ నెలకు లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ఆర్మీ సైనికుడు..

|

Aug 26, 2023 | 9:46 AM

రిటైర్డ్ సైనికుడు తూర్పు చంపారన్ జిల్లా పిప్రా కోఠి బ్లాక్‌లో ఉన్న సూర్య పూర్వ పంచాయతీ నివాసి. అతని పేరు రాజేష్ కుమార్.  సైనికుడిగా విధులు నిర్వహించి రిటైర్‌మెంట్‌ తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోకుండా వ్యవసాయం చేయడానికే మొగ్గు చూపారు. వ్యవసాయం చేస్తున్న రాజేష్ ను చూసి ఆ ఊరి జనం ఎగతాళి చేశారు. అయితే ఆ ఎగతాళి మాటలను రాజేష్ పట్టించుకోకుండా తన పని తాను అన్నట్లు చేసుకుంటూ వెళ్ళిపోయాడు..

Success Story: కేవలం 8 కత్త పొలంలో కూరగాయలు పండిస్తూ నెలకు లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ఆర్మీ సైనికుడు..
Agriculture Success Story
Follow us on

ఉద్యోగం నుంచి రిటైరయ్యాక విశ్రాంతి తీసుకోవాలని చాలామంది కోరుకుంటారు. తమకు వచ్చే పింఛనుతో వృధాప్యంలో తమ జీవితాన్ని హాయిగా, సరదాగా గడపాలని ఎక్కువమంది కోరుకుంటారు. అయితే  ఓ ఆర్మీ జవాను రిటైర్మెంట్ తర్వాత అద్భుతం చేశాడు.  దేశానికి సేవ చేసి రిటైర్మెంట్ తీసుకుని స్వ గ్రామానికి వచ్చి వ్యవసాయంపై దృష్టి సారించాడు. కూరగాయల సాగు ప్రారంభించాడు. దీంతో తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో తీసుకున్న ఆదాయంకంటే ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్న్నాడు. తాను పండించిన కూరగాయలు అమ్ముతూ లక్షల రూపాయలను ఆర్జిస్తున్నాడు బీహార్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ పర్సన్. మాజీ సైనికుడి సక్సెస్ స్టోరీ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

రిటైర్డ్ సైనికుడు తూర్పు చంపారన్ జిల్లా పిప్రా కోఠి బ్లాక్‌లో ఉన్న సూర్య పూర్వ పంచాయతీ నివాసి. అతని పేరు రాజేష్ కుమార్.  సైనికుడిగా విధులు నిర్వహించి రిటైర్‌మెంట్‌ తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోకుండా వ్యవసాయం చేయడానికే మొగ్గు చూపారు. వ్యవసాయం చేస్తున్న రాజేష్ ను చూసి ఆ ఊరి జనం ఎగతాళి చేశారు. అయితే ఆ ఎగతాళి మాటలను రాజేష్ పట్టించుకోకుండా తన పని తాను అన్నట్లు చేసుకుంటూ వెళ్ళిపోయాడు.. తాను చేపట్టిన వ్యవసాయం లాభాలను ఇవ్వడం ప్రారంభమైనప్పుడు.. రాజేష్ మరింత ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అందరూ మాట్లాడటం మానేశారు.

ఆనపకాయ సాగుతో ..

విశేషమేమిటంటే తొలుత రాజేష్ కుమార్ బొప్పాయి సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించాడు. మొదటి సంవత్సరంలోనే బొప్పాయి అమ్మి రూ.12.5 లక్షలు సంపాదించాడు. అప్పుడు విమర్శించిన అందరి నోళ్లు మూతపడ్డాయి. వచ్చిన లాభంతో ఉత్సాహంగా మరుసటి సంవత్సరం నుంచి అరటి,  కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టాడు. ఈసారి 8 కత్తల పొలంలో సొరకాయ సాగుకి శ్రీకారం చుట్టారు. రోజూ 300 సొరకాయలను  విక్రయిస్తూ 4 నుంచి 5 వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. ఇలా నెలకు దాదాపు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సొరకాయలను వ్యాపారులే స్వయంగా కొనుగోలు..

విశేషమేమిటంటే రాజేష్ కుమార్ తన వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. పంట చేతికి వస్తుందని అంచనాకు వచ్చిన తర్వాతే వ్యాపారులు పొలం దగ్గరకు వచ్చి నేరుగా కూరగాయలు కొంటారు. గోపాల్‌గంజ్, సివాన్, సీతామర్హి , శివహర్‌ల నుండి వ్యాపారులు రాజేష్ కుమార్ నుండి కూరగాయలు కొనడానికి అతని గ్రామానికి వస్తారు.

సొరకాయల సాగుతో పెరిగిన ఆదాయం

8 కత్తల పొలంలో సొరకాయ సాగు చేపట్టి.. రూ.10 నుంచి 20 వేల వరకు ఖర్చు చేసినట్లు రైతు రాజేష్ కుమార్ తెలిపారు. తాను పెట్టిన పెట్టుబడిని మినహాయిస్తే నెలకు రూ.1.30 లక్షల లాభం వస్తుందని  చెప్పారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..