కడచూపునకు నోచుకోకుండానే కన్నుమూసిన తల్లి.. కర్కోటకుడిలా మారిన కొడుకు..!

పున్నామా నరకం నుండి దూరం చేసే వాడే కొడుకు.. కానీ ఆ కొడుకు మాత్రం తల్లి చావును చూసి‌ కూడా మారలేదు. కడచూపు కోసం తాపత్రయ పడ్డ ఆ తల్లి.. మనోవేధన గురై కొడుకును‌ చూడకుండానే తనువు చాలించిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు‌ చేసుకుంది.

కడచూపునకు నోచుకోకుండానే కన్నుమూసిన తల్లి.. కర్కోటకుడిలా మారిన కొడుకు..!
Old Age Woman
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 17, 2024 | 9:18 AM

పున్నామా నరకం నుండి దూరం చేసే వాడే కొడుకు.. కానీ ఆ కొడుకు మాత్రం తల్లి చావును చూసి‌ కూడా మారలేదు. కడచూపు కోసం తాపత్రయ పడ్డ ఆ తల్లి.. మనోవేధన గురై కొడుకును‌ చూడకుండానే తనువు చాలించిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు‌ చేసుకుంది. కన్న కొడుకు రోడ్డు‌పాలు చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు మొరపెట్టుకున్నా కొద్ది‌సేపటికే, ఆ తల్లి కన్నుమూయడం స్థానికులను కన్నీరుపెట్టించింది.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క్రాంతి నగర్‌కు చెందిన వృద్ధ దంపతులు విఠాబాయి, దేవరావు సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. విఠాబాయి, దేవ్ రావు దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె కాగా, పెద్ద కొడుకు అనారోగ్యంతో రెండేళ్ల మరణించాడు. వయస్సు పైబడిన ఆ తమను చిన్న కొడుకు గంగారం భద్రంగా చూసుకుంటాడని భరోసా పెట్టుకున్నారు ఆ వృద్ద దంపతులు. కానీ ఏడాదిన్నర క్రితం కట్టుకున్న ఇంటి నుండి ఆ వృద్ద దంపతులు గెంటేశాడు కన్నకొడుకు గంగారం.

రెండేళ్లుగా చిత్రహింసలు పెడుతున్నా.. అన్నం పెట్టకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా భరించిన ఆ తల్లిదండ్రులను చివరికి ఇంటి నుంచి గెంటేశాడు. ఏడాదిన్నర కాలంగా కూతురి ఇంటి వద్ద ఉంటున్న ఆ వృద్ద దంపతులు తమ ఇంటిని కొడుకు నుండి విడిపించి కన్నకొడుకు మనసు మారేలా చేయాలని న్యాయం కోసం ఆదిలాబాద్ కలెక్టరేట్ కు వచ్చారు ఆ వృద్ద దంపతులు. దాదాపు నాలుగు గంటలు ఎదురు చూసి కలెక్టర్ రాజార్షి షా కు గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో న్యాయం జరుగుతుందన్న ఆశతో ఇంటికి బయలు దేరారు‌ ఆ వృద్ద దంపతులు.

కానీ అంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. కన్నకొడుకును కడసారి చూసే అవకాశం దక్కుతుందని భర్త కట్టిన ఇంట్లోనే తుది‌శ్వాస విడిచే భాగ్యం దక్కుతుందని ఆశపడ్డ ఆ తల్లి విఠలబాయికి నిరాశే మిగిలింది. కలెక్టరేట్ నుండి తిరుగు‌ ప్రయాణం అవుతూ ఆఖరి కోరిక తీరకుండానే ఊపిరి వదిలింది ఆ వృద్ద తల్లి. అనారో గ్యంతో బాధపడుతూనే తన ఆవేదనను కలెక్టర్ ఎదుట చెప్పుకున్న ఆమెకు న్యాయం జరగకుండానే కన్నుమూయడం అందరినీ కలచివేసింది.

కనిపెంచిన కన్నతల్లిదండ్రులకు కనీసం అన్నం ముద్ద కూడా పెట్టని కొడుకు తీరుతో మానసిక వేదనకు గురైన ఆ మాతృమూర్తి తనకు న్యాయం జరుగకుండానే కన్నుమూసింది. కనీసం తల్లి చనిపోయిందన్న సమాచారం తెలిసినా కొడుకు గంగారం మనసు మాత్రం మారలేదు. కర్కోటకుడిగా వ్యవహరించి తల్లికి తలకొరివి పెట్టేందుకు.. అంత్యక్రియలకు‌ కూడా హాజరు కాలేదు. చివరికి కూతురే కొడుకుగా మారి అన్ని కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. భార్య విఠలబాయి(90) అంత్యక్రియలు భర్త దేవ్ రావు నిర్వహించక తప్పలేదు. భార్య మృతితో ఒంటరైన దేవ్ రావుకైన కొడుకు గంగారం నుంచి‌ న్యాయం జరుగుతుందో లేదో చూడాలి..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై