Breaking News
  • తెలంగాణ లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి. తూర్పు బీహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. దీనికి అనుబంధంగా 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఈశాన్య ఝార్ఖండ్, ఒరిస్సా మీదుగా 1.5 కి.మీ 5.8 కి.మీ ఎత్తు మధ్య ఏర్పడిన మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు. ఈరోజు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, నారాయణ పేట జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీవర్షాలు. ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం.
  • కడప: ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల ఫోర్జరీ కేసు. నిందితుడు సుబ్రమణ్యంరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరికొందరిని ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు.
  • ఈ దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజునుప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ ను ఆరోజు ప్రారంభిస్తారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
  • ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు. ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన దీపికాపదుకొనె. ముంబై కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌లో దీపికా విచారణ. కరీష్మా, దీపికా చాటింగ్‌పై ఎన్సీబీ ప్రశ్నల వర్షం. కరీష్మాతో పరిచయం, డ్రగ్స్‌ సప్లయ్‌పై 4 గంటలుగా విచారణ. పల్లార్డ్‌లోని ఎన్సీబీ కార్యాలయంలో శ్రద్ధా, సారా విచారణ. త్వరలో కరణ్‌జోహార్‌కు సమన్లు జారీ చేసే అవకాశం.
  • మంచిర్యాల: బెల్లంపల్లిలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన. అదనపు కట్నం కోసం భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త మధుకర్‌. గతేడాది ఫిబ్రవరిలో మధుకర్‌తో విజయ వివాహం. అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులు. అత్తింటివారితో ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు.
  • గుంటూరు: టీడీపీ నేత నన్నపనేని రాజకుమారికి గాయం. తెనాలిలోని తన ఇంట్లో కాలుజారిపడ్డ నన్నపనేని. నన్నపనేని రాజకుమారి తలకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

డెంగ్యూ కి చెక్ పెట్టిన ఢిల్లీ.. ఎలా ? అదే పొలిటికల్ విల్.. పబ్లిక్ సపోర్ట్..

Dengue virus is transmitted by Mosquitoes, డెంగ్యూ కి చెక్ పెట్టిన ఢిల్లీ.. ఎలా ? అదే పొలిటికల్ విల్.. పబ్లిక్ సపోర్ట్..

ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ వైరల్ డిసీజ్ బారిన వేల సంఖ్యలో ప్రజలు పడుతున్నారు. ఏడ్స్ ఏజిప్టి అనే జాతికి చెందిన ఆడ దోమల వల్ల ఇది వ్యాపిస్తోంది. ఈ దోమ తాలూకు వైరస్ కారణంగా … డెంగ్యూ తో బాటు చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, జింకా ఇన్ఫెక్షన్ వంటివి సైతం సోకుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్న వేళ.. వర్షాకాల సీజన్ లో చెరువులు, నీటిగుంటలు, కాలువల్లో చేరే ఈ రకం దోమలు ఈ వ్యాధులకు కారణమవుతున్నాయి. డెంగ్యూకు సంబంధించిన మెజారిటీ కేసుల లక్షణాలను ఇప్పటికీ డాక్టర్లు ఖఛ్చితంగా నిర్ధారించలేకపోవడమే విశేషం. అందువల్లే ఈ కేసులను తక్కువగా చూపడం జరుగుతోంది. పైగా పలు కేసులను మిస్ క్లాసిఫై చేయడం విడ్డూరం. అంటే డెంగ్యూ కాకుండా ఇతర వ్యాధులకు సంబంధించిన కేసులుగానో, మామూలు జ్వరంగానో పొరబడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. 128 దేశాల్లో మూడు వందల కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి వైరస్ బారిన పడుతున్నారని అంచనా. ఇండియాలో నాలుగు రకాల వైరస్ లు మరీ ప్రబలుతున్నాయి. 2015 లో ఒక్క ఢిల్లీలోనే 15 వేల 867 కేసులు నమోదు కాగా 70 మందికి పైగా రోగులు మృత్యువాత పడ్డారు.
డెంగ్యూ రోగుల రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోతుంది. రక్తం పలచబడిపోతుంది. అయితే దీనికి విరుధ్ధంగా జరిగి కెపిల్లరీ లీకేజీ కారణంగా రక్తం థిక్ గా మారిన పక్షంలో ఫలితాలు మరోలా ఉంటాయట. తక్కువ స్థాయి ప్లేట్ లెట్స్ కారణంగా రోగికి ప్రధానంగా ద్రవీకృత ఆహారమే ఇవ్వాల్సిఉంటుంది. జ్వరం తగ్గినట్టే తగ్గినా, రోగికి నరాల బలహీనత పెరిగిన పక్షంలో డెంగ్యూ సీరియస్ అవుతుంది. ఇంటర్నల్ వాస్క్యులార్ డీహైడ్రేషన్ కూడా తోడైతే మరీ డేంజరే ! ఢిల్లీలో డెంగ్యూను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు చర్యలుచేపట్టింది. మొదట అధికారులు ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు. కాలువలు, చెరువుల్లో దోమల నిర్మూలనకు, అలాగే వీధుల్లో ఫామింగ్ వంటివి విస్తృతంగా చేపడుతున్నారు.
సిటీలో ఈ వ్యాధి కేసులపై ‘ ఉక్కుపాదం ‘ మోపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య, పారిశుధ్య శాఖలు, ఆస్పత్రులు, క్లినిక్ లు, స్కూలు పిల్లలతో బాటు ప్రజలు, యువకులు, మహిళా బృందాల సంయుక్త సహకారంతో ఈ వ్యాధి తాలూకు కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. 2015 లో ఈ నగరంలో తొలి ‘ మొహల్లా క్లినిక్ ‘ వెలిసింది. ప్రస్తుతం వీటి సంఖ్య 203 కి పెరిగింది. ఏసీతో కూడిన ఈ క్లినిక్ లలో ప్రయివేటు ఆసుపత్రి వంటి వాతావరణం ఉంటుంది. వీటిలో 109 అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి. అలాగే నిపుణులైన డాక్టర్లు రోగులకు రకరకాల డయాగ్నస్టిక్ టెస్టులు చేయడానికి సిధ్ధంగా ఉంటారు.
నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో డెంగ్యూ రోగులకు ప్రత్యేకంగా వెయ్యి బెడ్స్ ఏర్పాటు చేశారు. ప్రయివేటు హాస్పిటల్స్ లోనూ పడకల సంఖ్యను 10 నుంచి 20 శాతం పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. డెంగ్యూ అదుపునకు వర్క్ షాపులను నిర్వహిస్తున్నారు. అలాగే ప్లేట్ లెట్ కౌంట్ టెస్టుకు 50 రూపాయలు, ఎన్ ఎస్ ఐ ఎలీసా టెస్టుకు 600 రూపాయలు ఫీజుగా వసూలు చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ చిత్తశుద్ది, ప్రజల సహకారం ఉంటే ఈ వ్యాధిని పూర్తిగా అదుపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

 

Related Tags