ఢిల్లీ ఎయిమ్స్ సిబ్బంది నిర్వాకం.. శవాల తారుమారు

ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా కేర్ సిబ్బంది నిర్వాకం వల్ల మంగళవారం ఓ వర్గం డెడ్ బాడీకి మరో వర్గం కుటుంబం అంత్యక్రియలు నిర్వహించారు. మరో వర్గం డెడ్ బాడీని ఇంకో వర్గం వాళ్లు ఖననం చేసేందుకు తీసుకెళ్లారు. డెడ్ బాడీలు అప్పగించే సమయంలో కనీసం మొఖం చూపించే పరిస్థితి లేకపోవటంతో ఇలాంటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఢిల్లీ ఎయిమ్స్ సిబ్బంది నిర్వాకం.. శవాల తారుమారు
Follow us

|

Updated on: Jul 09, 2020 | 5:19 PM

కరోనా రాకాసి కోరలకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. అంటురోగం కారణంగా అయినవారిన వారినే దూరం చేస్తోంది. సొంత కుటుంబ సభ్యులనే దరి చేరకుండా చేస్తోంది. ఇక, కరోనాతో చనిపోతే కనీసం కుటుంబ సభ్యులు చివరి చూపుకు కూడా నోచుకోవడంలేదు. అందరు ఉండి కూడా అనాథ శవాలవుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా కేర్ సిబ్బంది నిర్వాకం వల్ల మంగళవారం ఓ వర్గం డెడ్ బాడీకి మరో వర్గం కుటుంబం అంత్యక్రియలు నిర్వహించారు. మరో వర్గం డెడ్ బాడీని ఇంకో వర్గం వాళ్లు ఖననం చేసేందుకు తీసుకెళ్లారు. డెడ్ బాడీలు అప్పగించే సమయంలో కనీసం మొఖం చూపించే పరిస్థితి లేకపోవటంతో ఇలాంటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

తాజా ఢిల్లీలో జరిగిన ఘటన ట్రామా సిబ్బంది నిర్లక్ష్యం కొట్టోచ్చినట్లు కనిపించింది. కొంచం ఆలస్యమైతే ఒక వర్గం వ్యక్తికి చెందిన డెడ్ బాడీని మరో వర్గం వారు ఖననం చేసేవారే. కానీ చివరి నిమిషంలో చనిపోయిన వ్యక్తి పిల్లలు తమ అమ్మను ఒక్కసారి చూడాలని పట్టుబట్టడంతో డెడ్ బాడీపై కప్పిన కవర్ తీసేసరికి అంతా షాక్ కు గురయ్యారు ఆ మృతదేహం వాళ్ల అమ్మది కాదని, వేరే ఓ వర్గానికి చెందిన వ్యక్తిదని గుర్తించారు. దీంతో అసలు వారి అమ్మ డెడ్ బాడీ ఎమైందోనన్న ఆందోళన మరింత కంగారుపెట్టించింది.

కరోనాతో చనిపోయిన రెండు వర్గాల వారి డెడ్ బాడీలను కుటుంబాలకు అప్పగించే సమయంలో ఒకరి డెడ్ బాడీని మరొకరి కుటుంబానికి ఇచ్చేశారు ఎయిమ్స్ సిబ్బంది. వెంటనే ఎయిమ్స్ కు ఆ బాడీని తీసుకెళ్లి వారికి అప్పగించి ‘మా అమ్మ డెడ్ బాడీ మాకు ఇవ్వండి’ అని కోరారు. అప్పటికే ఆ వర్గానికి కుటుంబానికి చెందిన వ్యక్తి డెడ్ బాడీని ఇంకో వర్గం కుటుంబానికి అప్పగించటం, వాళ్లు అంత్యక్రియలు పూర్తి చేయటం జరిగిపోయింది. దీంతో ఓ వర్గం కుటుంబానికి చెందిన వాళ్లు తమ వారు కాని వ్యక్తికి దహన సంస్కారాలు చేశామని… మా అమ్మ డెడ్ బాడీకి కనీసం అంత్యక్రియలు నిర్వహించలేకపోయామని మరో వర్గం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎయిమ్స్ ట్రామా కేర్ మార్చురీ స్టాఫ్ నిర్వాకంపై ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీరియస్ అయ్యారు. ఈ సంఘటనపై ప్రత్యేక అధికారిని నియమించి విచారణకు ఆదేశించామని చెప్పారు. సంఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. మరో వ్యక్తిని సస్పెండ్ చేశామన్నారు. డెడ్ బాడీ అప్పగించే సమయంలో మృతదేహం ముఖం చూపించాలని కోరినప్పటికీ 500 రూపాయలు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. శ్మశానికి వెళ్లాక కూడా చివరిసారిగా డెడీ బాడీ ముఖం చూసేందుకు 500 రూపాయలు ఇస్తేనే అవకాశం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Articles
మూడో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
మూడో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
దినేష్ కార్తీక్ ఎదుట తల వంచిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో
దినేష్ కార్తీక్ ఎదుట తల వంచిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..