తిరువనంతపురం విమానాశ్రయ నిర్వహణ అదానీ గ్రూపుదే !

తిరువనంతపురం విమానాశ్రయ నిర్వహణను అదానీ గ్రూపునకు అప్పగించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ ను గత ఆగస్టు 21 న కేరళ సర్కార్ దాఖలు చేసింది. విమానాశ్రయాన్ని అదానీ గ్రూపునకు లీజుకు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ లోగడ నిర్ణయించింది. అయితే  దీన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కేరళలో అఖిల పక్ష సమావేశం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 50 ఏళ్ళ […]

తిరువనంతపురం విమానాశ్రయ నిర్వహణ అదానీ గ్రూపుదే !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 19, 2020 | 3:18 PM

తిరువనంతపురం విమానాశ్రయ నిర్వహణను అదానీ గ్రూపునకు అప్పగించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ ను గత ఆగస్టు 21 న కేరళ సర్కార్ దాఖలు చేసింది. విమానాశ్రయాన్ని అదానీ గ్రూపునకు లీజుకు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ లోగడ నిర్ణయించింది. అయితే  దీన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కేరళలో అఖిల పక్ష సమావేశం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 50 ఏళ్ళ పాటు లీజుకు తీసుకోవాలని అదానీ గ్రూపు నిర్ణయించింది. కాగా ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వచ్చింది .. హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఇక ప్రభుత్వం సుప్రీంకోర్టుకెక్కవచ్చునని భావిస్తున్నారు.