గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా ఫ్యాన్స్‌కి దర్శనమిచ్చిన హీరో ప్రభాస్..

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, నటీనటులందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే చాలా మంది నటీనటులు పలు సోషల్ మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటున్నారు. కానీ హీరో ప్రభాస్ మాత్రం.. చాలా దూరంగా ఉంటూ వచ్చారు. అప్పట్లో ఓ సినిమా కోసం ఫారెన్ వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా...

గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా ఫ్యాన్స్‌కి దర్శనమిచ్చిన హీరో ప్రభాస్..
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2020 | 7:25 PM

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, నటీనటులందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే చాలా మంది నటీనటులు పలు సోషల్ మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటున్నారు. కానీ హీరో ప్రభాస్ మాత్రం.. చాలా దూరంగా ఉంటూ వచ్చారు. అప్పట్లో ఓ సినిమా కోసం ఫారెన్ వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాడు ప్రభాస్. కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్‌లో కూడా ఉన్నాడు ప్రభాస్. కాగా ఇప్పుడు గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా.. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి రెబల్ స్టార్ తన ఇంటి ముందు ఆవరణలో మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌తో కలిసి ప్రభాస్ సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వరంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ప్రభాస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడుకున్నది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా వారు దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్యక్రమం నన్ను ఇన్ స్పైర్ చేసింది. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నాను. సంతోష్ కుమార్ గారి మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే.. మనమంతా వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజం బావుంటుందని నా భావన. ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మెగాపవర్ స్టార్ రాంచరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు నామినేట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ప్రభాస్.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్