హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది.  బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో సాయంత్రం నుంచి నగరం అంతటా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం
Follow us

|

Updated on: Oct 09, 2020 | 6:59 PM

హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది.  బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో సాయంత్రం నుంచి నగరం అంతటా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్, బోయిన్‌పల్లి, ఫతేనగర్, మాసబ్ ట్యాంక్,  మెహదీపట్నం,  టోలిచౌకి, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌, పంజాగుట్ట,షేక్‌పేట, బోరబండ, ముషీరాబాద్, గాంధీనగర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, రాంనగర్‌, అబిడ్స్‌, అఫ్జల్‌గంజ్‌, కోఠి, పురానాపూల్‌లో ప్రాంతాల్లో గంట నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉద్యోగస్తులు ఆఫీసుల నుంచి తిరిగి ఇంటికెళ్లి సమయం కావడంతో పలుచోట్లు భారీగా ట్రాఫిక్‌కు జామ్ అయ్యింది. మరోవైపు రోడ్లపైకి భారీగా వర్షపునీరు ప్రవహిస్తూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన అధికారులు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మెట్రో స్టేషన్ల కింద భారీగా  వర్షపు నీరు నిలిచింది.  ( Bigg Boss Telugu 4: ఫన్‌లోనూ, పారితోషకంలోనూ ఇతడే టాప్ ! )

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో శుక్రవారం ఉదయం 05.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపొస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటలలో ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండముగా మారే ఛాన్స్ ఉంది. తదుపరి ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో సోమవారం ఉదయం వాయుగుండముగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45- 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ( రైతులకు జగన్ సర్కార్ మరిన్ని వరాలు, ఉచితంగానే మోటార్లు, పంపు సెట్లు )