World Kidney Day 2021: పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు.. కిడ్నీ సమస్యను గుర్తించడమెలా?.. సమస్యకు పరిష్కారం ఏమిటీ..?

|

Mar 11, 2021 | 10:41 AM

World Kidney Day 2021: ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రతియేటా ఎందరో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. భారత్‌లో ప్రతి ఏటా కొత్తగా రెండున్నర లక్షల మంది...

World Kidney Day 2021: పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు.. కిడ్నీ సమస్యను గుర్తించడమెలా?.. సమస్యకు పరిష్కారం ఏమిటీ..?
Follow us on

World Kidney Day 2021: ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రతియేటా ఎందరో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. భారత్‌లో ప్రతి ఏటా కొత్తగా రెండున్నర లక్షల మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి ఏటా మూడున్నరకోట్ల మందికి డయాలసిస్‌ చేయాల్సి వస్తోంది. మార్చి 11న కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

భారతదేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘ది లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌’ నివేదిక ప్రకారం.. మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని ఈ నివేదిక సారాంశం. వీటన్నింటికి కారణం మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోవడమే. మహిళలైతే పని ధ్యాసలో పడి కిడ్నీల సంగతే మర్చిపోతున్నారు. జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎములకు భరోసా ఇస్తాయి. అయితే కిడ్నీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీల విషయంలో నిర్లక్ష్యం వహించినట్లతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

కిడ్నీ సమస్యను గుర్తించడం ఎలా..?

మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా, కాళ్లవాపు బాగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లే గుర్తించాలి. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం రావడం, వాంతులు చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఆ ప్రభావం పడుతుంది. అలసట, మెదడుకు సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి తీవ్రమైన సందర్భంలో రక్తహీనత వస్తుంది. కిడ్నీలు ఉండే భాగంలో నొప్పి వస్తుంటుంది. నొప్పితో పాటు కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లకు కూడా కారణమవుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. ఇది కిడ్నీలు సరిగా పని చేయడం లేదనడానికి సంకేతంగా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం బెటర్‌.

కిడ్నీ సమస్యకు పరిష్కారం ఏమిటీ..?

► రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి

► క్యాప్సికంలో ఉండే విటమిన్‌ఎ, సీ, పోటాషియం తదితర పోషకాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

► నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

► బెర్రీలలో ఫైబర్‌, విటమిన్లు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోయేలా చేస్తాయి.

► ఓట్స్‌, కాలిఫ్లవర్‌, ఉల్లిపాయలు, పైనాపిల్స్‌ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

► మూత్రం వచ్చినపుడు వెంటనే వెళ్లాలి. లేకపోతే కిడ్నీపై ప్రభావం చూపుతుంది.

ఇవి చదవండి :

Beetroot Juice Benefits: రోజూ పరగడుపునే బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుంది..? గర్భిణీలు తాగొచ్చా..?

Fruit Juices: సమ్మర్‌లో అధిక శక్తిని ఇచ్చే పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు

Brain Stroke: బ్రెయిన్‌ స్ట్రోక్‌కు నెల ముందు కనిపించే లక్షణాలు.. ముందస్తుగా గమనిస్తే బయట పడవచ్చంటున్న పరిశోధకులు