జుట్టు ఊడటంతోపాటు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీకు ఆ లోపం ఉన్నట్లే.. జాగ్రత్త

జింక్ మన శరీరానికి అవసరమైన ఖనిజం. ఆరోగ్యంగా ఉంచేందుకు.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.. పుండ్లు, గాయాలు నయం చేయడంతోపాటు.. ఆరోగ్యకరమైన కణాల విభజనలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి ఖనిజాల లోపం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆహారంలో జింక్ తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

జుట్టు ఊడటంతోపాటు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీకు ఆ లోపం ఉన్నట్లే.. జాగ్రత్త
Zinc Deficiency
Follow us

|

Updated on: Jun 16, 2024 | 11:44 AM

జింక్ మన శరీరానికి అవసరమైన ఖనిజం. ఆరోగ్యంగా ఉంచేందుకు.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.. పుండ్లు, గాయాలు నయం చేయడంతోపాటు.. ఆరోగ్యకరమైన కణాల విభజనలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి ఖనిజాల లోపం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆహారంలో జింక్ తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

వాస్తవానికి.. నేటి బిజీ లైఫ్‌లో సరైన ఆహారం తీసుకోలేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో జింక్ లోపం ఏర్పడడం సర్వసాధారణంగా మారింది.. అందుకే.. ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టిసారించడం ముఖ్యమని, దీనిపై అవగాహనతో ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శరీరంలో జింక్ లోపం వల్ల అనేక సమస్యలు మొదలవుతాయి.. మొదట్లో ఈ లక్షణాలను గుర్తించడం కష్టంగా మారుతుంది.. అందుకే.. దీని లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.. జింక్ లోపం వల్ల శరీరంలో కనిపించే సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది..

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి జింక్ సహాయపడుతుంది . దీని లోపం వల్ల శరీరానికి అంటువ్యాధులతో పోరాడటం కష్టమవుతుంది.. దీని కారణంగా జలుబు, దగ్గు, చెవి ఇన్ఫెక్షన్ మొదలైనవి తరచూ వస్తాయి.. అందుకే.. దీనిలోపం లేకుండా చూసుకోవాలి..

గాయాలు మానడంలో జాప్యం: గాయం నయం చేసే ప్రక్రియలో జింక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాని లోపం కారణంగా, శరీరం గాయాలను నయం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.

జుట్టు రాలడం – చర్మ సమస్యలు: ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోసం జింక్ అవసరం. దీని లోపం జుట్టు రాలడం, పొడి చర్మం, మొటిమలు, చర్మ గాయాల వంటి లక్షణాలను కలిగిస్తుంది.

ఆకలిని కోల్పోవడం – బరువు తగ్గడం: జింక్ ఆకలిని నియంత్రించడానికి, రుచి అనుభూతిని నిర్వహించడానికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల ఆకలి మందగించి బరువు తగ్గవచ్చు.

వాసన చూసే సామర్థ్యం తగ్గుతుంది: జింక్ రుచి, వాసన భావాన్ని ప్రభావితం చేస్తుంది. దాని లోపం కారణంగా, ఆహారం రుచి తెలియకపోవచ్చు.. ఇంకా వాసన పసిగట్టే సామర్థ్యం కూడా తగ్గుతుంది.

రాత్రి వేళల్లో చూపు సరిగా ఉండదు: తీవ్రమైన జింక్ లోపం వల్ల రాత్రిపూట దృష్టి సరిగా కనిపించదు..

మీరు ఈ లక్షణాలలో దేనినైనా ఎదుర్కొంటుంటే, వైద్యుడిని సంప్రదించండి. రక్తాన్ని పరీక్షించడం ద్వారా వైద్యులు జింక్ స్థాయిని తనిఖీ చేసి..సకాలంలో వైద్యాన్ని అందిస్తారు. దీంతో ఈ లోపాన్ని అధిగమించవచ్చు..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం