Food Coma 1

'ఫుడ్‌ కోమా' గురించి మీరెప్పుడైనా విన్నారా? 

24 June 2024

image

TV9 Telugu

మధ్యాహ్న భోజనం చేసి వస్తామా... ఏదో అలసటగా, అసౌకర్యంగా మీకెప్పుడైనా అనిపించిందా? కాసేపు అలా ఉండీ ఉండగానే నిద్రమత్తూ ఆవహించేస్తుంది. ఇలా మీకెప్పుడైనా జరిగిందా?

TV9 Telugu

మధ్యాహ్న భోజనం చేసి వస్తామా... ఏదో అలసటగా, అసౌకర్యంగా మీకెప్పుడైనా అనిపించిందా? కాసేపు అలా ఉండీ ఉండగానే నిద్రమత్తూ ఆవహించేస్తుంది. ఇలా మీకెప్పుడైనా జరిగిందా? 

అయితే, మీరు 'ఫుడ్‌ కోమా’లోకి వెళ్తున్నట్లే. ఇందుకు కారణమేంటో తెలుస్తే కచ్చితంగా పరేషాన్‌ అవుతారు. సాధారణంగా మనం ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మళ్లీ రాత్రికి రైస్‌ లాంటివి తింటుంటాం కదా!

TV9 Telugu

అయితే, మీరు 'ఫుడ్‌ కోమా’లోకి వెళ్తున్నట్లే. ఇందుకు కారణమేంటో తెలుస్తే కచ్చితంగా పరేషాన్‌ అవుతారు. సాధారణంగా మనం ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మళ్లీ రాత్రికి రైస్‌ లాంటివి తింటుంటాం కదా!

అందులో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లాంటివి అధికంగా ఉండడమే ఈ ఫుడ్‌కోమా కండిషన్‌కి అసలు కారణమట. ఆ సమయంలో మన శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణంచేసే పనిలో పడుతుంది

TV9 Telugu

అందులో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లాంటివి అధికంగా ఉండడమే ఈ ఫుడ్‌కోమా కండిషన్‌కి అసలు కారణమట. ఆ సమయంలో మన శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణంచేసే పనిలో పడుతుంది

TV9 Telugu

తద్వారా రక్తప్రవాహం జీర్ణవ్యవస్థవైపు మళ్లడం వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుందట. అంతేకాదు, తిన్న వెంటనే బ్లడ్‌ షుగర్‌ స్థాయులను మేనేజ్‌ చేయడానికి శరీరం ఇన్సులిన్‌ను విడుదలచేస్తుంది కదా! 

TV9 Telugu

ఈ ఇన్సులిన్‌ మెదడులో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తిచేస్తుంది. ఇది సెరటోనిన్, మెలటోనిన్‌ అనే హార్మోనులను ఎక్కువ మోతాదులో విడుదల చేసి, మనకు నిద్రపట్టేలా చేస్తుంది

TV9 Telugu

అందుకే, పూర్తిగా కడుపు నిండుగా లాగించేయకుండా.. ఇంకొంచెం తిందాం అనిపించినప్పుడే ఆపేయడం మంచిది. ఇలా చేస్తే మనం మెలకువతోనూ, యాక్టివ్‌గానూ ఉండగలుగుతాం

TV9 Telugu

ఈ విధమైన పరిస్థితి మధ్యాహ్న సమయంలో ఎక్కువగా వస్తుంటుంది. అందుకు కారణం... మన ఆహారంలో ఉండే అధిక కార్బోహైడ్రేట్లే. దీన్ని తగ్గించుకోవాలంటే కొంచెం కొంచెం ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి

TV9 Telugu

దాని వల్ల శరీరంలో ఒక్కసారిగా ఇన్సులిన్‌ స్థాయులు పెరగకుండా ఉంటాయి. ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులూ, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లూ లాంటి పోషకాలు ఉండే ఆహారాలు తీసుకుంటే గ్లూకోజు స్థాయులు స్థిరంగా ఉంచుతాయి. దీర్ఘకాలంలో ఇలా జరిగితే అధికబరువు, టైప్‌2 డయాబెటిస్, హృద్రోగాలూ వచ్చే అవకాశం ఉంది