24 June 2024

రోజూ రెండు పుదీన ఆకులు  నమిలితే.. 

Narender.Vaitla

రోజూ క్రమం తప్పకుండా పుదీన ఆకులను తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి.

కంటి చూపును మెరుగు పరచడంలో పుదీనా కీలకంగా పనిచేస్తుంది. రోజూ రెండు ఆకులను నమిలితే కంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

ఒత్తిడితో ఇబ్బంది పడే వారికి కూడా పుదీనా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మీ శరీరాన్ని కాపాడుతాయి.

నిత్యం జలుబుతో బాధపడేవారికి పుదీన తీసుకునే ఉపశమనం లభిస్తుంది. ముక్కు నుంచి శ్వాస ఆడలేని పరిస్థితిలో పుదీనా డీకంజెస్టెంట్‌గా పనిచేస్తుంది. 

నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారికి పుదీనా దివ్యౌషధంగా చెప్పొచ్చు. నోటిలోని బ్యాక్టీరియాను దూరం చేయడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది.

వ్యాధుల బారిన తక్కువగా పడాలనుకునే వారు పుదీనా ఆకులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ రోగ నిరోధక శక్తిని పెంచతాయి.

జుట్టు రాలకుండా ఉండడంలో కూడా పుదీనా ఉపయోగపడుతుంది. ఇందులోని కెరోటీన్, యాంటాక్సిడంట్లు జుట్టు రాలకుండా ఉపయోగపడతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.