24 June 2024

దొండకాయతో మతిమరుపు వస్తుందని అనుకుంటున్నారా.? 

Narender.Vaitla

దొండకాయలు డైటరీ ఫైబర్‌కు పెట్టింది పేరు. దీనిలోని థయామిన్‌ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మరుస్తుంది. దీని వల్ల జీర్ణ క్రియ సజావుగా జరుగుతుంది.

అల్సర్‌, గ్యాస్‌ వంటి కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా దొండకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే కచ్చితంగా దొండకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని బీటా కెరోటిన్‌, విటమిన్‌ ఏగా మారి దృష్టి లోపాలను సరిచేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా దొండకాయ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని మంచి గుణాలు.. జీవక్రియ రేటును పెంచి కొవ్వు కణాలను కరిగించడంలో ఉపయోగపడుతుంది.

దొండకాయ తింటే మతిమరుపు వస్తుందని భావిస్తారు. నిజానికి దొండకాయ నరాల వ్యవస్థను బలోపేతం చేసి అల్జీమర్స్‌ లాంటి వాటి లక్షణాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

షుగర్‌ పేషెంట్స్‌కి కూడా దొండకాయ దివ్యౌషధంగా నిపుణులు చెబుతుంటారు. రక్కంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దొండకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి కూడా దొండకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. వారానికి రెండుసార్లు దొండకాయ తింటే రాళ్లు ఏర్పడవు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.