Winter Health Care: చలి పెరుగుతుంది.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు.. ఏంటంటే..

|

Dec 16, 2021 | 9:33 AM

చలి తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతుంది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో చలి ప్రభావం మరింత ఎక్కువవుతుంది

Winter Health Care: చలి పెరుగుతుంది.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు.. ఏంటంటే..
Winter Health Care
Follow us on

చలి తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతుంది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో చలి ప్రభావం మరింత ఎక్కువవుతుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతుంది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి చలి తీవ్రత మరింత పెరిగిపోతుంది. ఈ సీజన్‏లో అనారోగ్య సమస్యలు జలుబు, దగ్గు వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఓవైపు పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి… మరొవైపు ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ అంతకంతకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ శీతకాలంలో చలి తీవ్రతను తట్టుకోవడానికి.. కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అనారోగ్య సమస్యలను మరింత ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.

1. ఈ శీతకాలంలో చర్మ సమస్యలు అధికంగా వేధిస్తుంటాయి. అందుకే ఉదయం, సాయంత్రం బయటకు వెళ్లేవారు… చెవులు, ముక్కును కప్పేలా వస్త్రాలు ధరించాలి. చల్లగాలి చెవులు, ముక్కులోకి పోతే జలుబు, తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే.. కాళ్లు, చేతులు, పెదాలు పగిలే ప్రమాదం ఉంటుంది. వింటర్ క్రీమ్స్ అప్లై చేసుకోవాలి.
2. ఈ కాలంలో చలి నీళ్లతో స్నానం చేయవద్దు. వేడి నీళ్లతో స్నానం చేయాలి. వేడి వేడి పదార్దాలను ఆహారంగా తీసుకోవాలి.
3. ఉదయం వేళ పొగమంచు కురిసే ప్రమాదం ఉంది. కాస్త తెల్లవారిన తర్వాత.. ఎండ వస్తున్న సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది. మంచు కురిసే సమయంలో రాత్రి, పగలు ప్రయాణించకపోవడమే మంచిది.
4. చలికి బైక్స్ పై వెళ్లేవారు నిదానంగా వెళ్లాలి. చలికి చేతులు ఒణికి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఉదయం, సాయంత్రం చిన్నారులు, వృద్దులు బయటికి రావద్దు. స్వెట్టర్లు, వేడిని ఇచ్చే దుస్తులను ధరించాలి.
5. చలికి రాత్రి వేళ ఇంట్లోకి పాములు, విష పురుగులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే రాత్రిళ్లు ఇంటిని జాగ్రత్తగా పరిశీలించాలి. దుప్పట్లను బాగా దులిపి ఏం లేవని నిర్దారించుకున్నాకే వేసుకోవాలి.
6. చలి మంటలు వేసుకున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. చలి జ్వరం, జలుబు వచ్చిన వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. చల్లని పదార్దాలకు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్, ఇతర చల్లని పానీయాలకు దూరంగా ఉండడం మంచిది. చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
7. రోజూ ఆలివ్‌ ఆయిల్, కొబ్బరినూనెతో మసాజ్‌ చేసుకుని తలస్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడి బారుతుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి.
8. పగిలిన పాదాలకు విటమిన్ ఈ క్రీమ్ రాస్తే మంచిది. ఆస్తమా ఉన్నవారు చలికాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాస నాళాలు మూసుకుపోకుండా వైద్యుడి సలహా మేరకు మందులు వాడాలి. ఇన్‌హేలర్, నెబ్యులైజర్‌ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. గుండెజబ్బులు ఉన్న వారు, గుండె ఆపరేషన్‌ చేయించుకున్నవారు వాకింగ్‌ చేయకూడదు.
9. చలిగాలులు వీస్తున్న సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండేందుకు పొడి దుస్తులను ధరించాలి. చలి తీవ్రతతో జలుబు బాగా వచ్చి ఊపిరి తీసుకునే అవకాశం ఉండదు. అలాంటప్పుడు నెబ్యులైజర్‌ వినియోగించుకోవాలి.
10. పొలం పనులకు వెళ్లేవారికి చలి వల్ల కాళ్లు, చేతులు దురదలు పెడుతుంటాయి. వ్యాజిలిన్, చర్మ క్రీములు రాసుకోవడం ఉత్తమం. పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు ఉన్ని దుస్తులు ధరించాలి.

Also Read: Brahmastra: ‘సామాన్యుల ఊహకు అందనిది, ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది’.. ఆసక్తిని పెంచేసిన బ్రహ్మస్త్ర మోషన్ పోస్టర్..

RRR Trailer: రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ ట్రైలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమా ఇదే..

Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..