Health: రెగ్యులర్ గా బ్లడ్ చెస్ట్ చేయించుకోండి.. లేకపోతే ఈ సమస్యలను కోరి తెచ్చుకున్నట్లే

సాధారణంగా మనం అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే బాడీ చెకప్ చేయించుకుంటాం. కానీ ఇలా చేయడం ద్వారా భవిష్యత్ లో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రక్త పరీక్ష చేయించుకోవడం చాలా...

Health: రెగ్యులర్ గా బ్లడ్ చెస్ట్ చేయించుకోండి.. లేకపోతే ఈ సమస్యలను కోరి తెచ్చుకున్నట్లే
Blood Circulation
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 2:45 PM

సాధారణంగా మనం అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే బాడీ చెకప్ చేయించుకుంటాం. కానీ ఇలా చేయడం ద్వారా భవిష్యత్ లో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రక్త పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రక్తం శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది. కాబట్టి దీన్ని టెస్ట్‌ చేయడం వల్ల శరీరంలో జరిగే ప్రతి చిన్న, పెద్ద మార్పులను గుర్తించవచ్చు. ముప్పై నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరూ రక్త పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంవత్సరానికి ఒక సారైనా బ్లడ్‌ టెస్ట్‌ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. పూర్తి బాడీ ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌ టెస్ట్‌ (CBC) చాలా అవసరం. రక్తహీనత, ఇన్ఫెక్షన్, లుకేమియా వంటి సమస్యలను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. హార్మోన్‌ చెక్ రక్త పరీక్ష ప్యానెల్‌లలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్, సీరం, హార్మోన్ (FSH), లూటినైజింగ్ హార్మోన్ (LH), థైరాక్సిన్ (T4), ఫ్రీ, డైరెక్ట్, సీరం పరీక్షలు ఉంటాయి.

రక్తపరీక్ష సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిలను గుర్తించవచ్చు. ఈ టెస్ట్‌తో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ రాకుండా జాగ్రత్తపడవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే రక్తనాళాల గోడలు దెబ్బతిని పూడికలు ఏర్పడతాయి. అధిక కొలెస్ట్రాల్‌ వల్ల గుండె పోటు, స్ట్రోక్‌ వంటి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఇన్సులిన్‌ హార్మోన్‌ చక్కెర నిల్వలను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇన్సులిన్‌ తగినంత ఉత్పత్తి కాకపోయినా, సమర్థంగా పనిచేయకపోయినా రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరిగిపోతాయి.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో థైరాయిడ్ పని తీరును ట్రాక్ చేసేందుకు రక్త పరీక్ష చాలా అవసరం. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే థైరాయిడ్‌ గ్రంథి పనితీరు దెబ్బతింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కొరకు మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి