మీరు బీపీతో బాధపడుతున్నారా..? అదుపులో లేకపోతే హార్ట్‌ఎటాకే.. ఈ జాగ్రత్తలు పాటించండి తర్వాత మీకే తెలుస్తోంది..

|

Feb 20, 2021 | 10:45 AM

Blood Pressure: ఆధునిక జీవన శైలిలో వయసుతో సంబంధం లేకుండా అందరు రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనివల్ల ఎన్నో అనర్థాలు

మీరు బీపీతో బాధపడుతున్నారా..? అదుపులో లేకపోతే హార్ట్‌ఎటాకే.. ఈ జాగ్రత్తలు పాటించండి తర్వాత మీకే తెలుస్తోంది..
Follow us on

Blood Pressure: ఆధునిక జీవన శైలిలో వయసుతో సంబంధం లేకుండా అందరు రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండెపనితీరుపై ఇది ప్రభావితం చేస్తుంది. అందుకే బీపీతో చాలా జాగ్రత్తంగా ఉండాలి లేదంటే ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే బీపీకి గురైన వారు ఎలాంటి జాగ్తత్తలు పాటించాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే వాటిపై వైద్య నిపుణులు ఈ విధంగా సూచిస్తున్నారు.

అధిక రక్తపోటు ఉన్నవారు బరువు ఎక్కువగా ఉంటే, తగ్గినపుడు నియంత్రణలోకి వస్తుంది. ఆహారంలో సోడియం లేదా ఉప్పు తక్కువగా తీసుకోవాలి. రోజూ తీసుకునే పప్పు, కూరలలో ఉప్పు తగ్గించాలి. ఊరగాయలు, పచ్చళ్ళు, ఉప్పు కలిపి చేసే పిండి వంటలు, చిరుతిళ్ళు మానెయ్యాలి. మీ ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వారానికి నాలుగు రోజులు ఆకుకూరలు తినాలి. మీ ఆహారంలో సాచురేటెడ్‌ కొవ్వులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అధిక నూనెలో వేయించిన వేపుళ్ళు, చిరుతిళ్ళు, బేకరీ ఫుడ్స్‌ లాంటి వాటికి దూరంగా ఉండండి. రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే సరైన ఆహార నియమాలతో పాటు రోజూ వ్యాయామం కూడా ముఖ్యం. ఇవి పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

సైబర్ వలకు ఇద్దరు వైద్యుల విలవిల.. ఓటీపీ అడిగారు.. లక్షలు కొల్లగొట్టారు.. మాటలతో మభ్యపెట్టి ముంచేసారు..