సాధారణంగా డీహైడ్రేషన్ గురించి మనమందరం వినే ఉంటాం. అయితే సైలెంట్ డీహైడ్రేషన్ అనే దాని గురించి చాలా మందికి తెలియదు. దీనిని తేలికగా తీసుకుంటే మాత్రం తీవ్రమైన అనారోగ్య పరిణామాలకు దారితీస్తుంది. ఇటీవల హైదరాబాద్ వేదికగా టీవీ9 నెట్‌వర్క్, సౌత్ ఫస్ట్ సంయుక్తంగా నిర్వహించిన మొదటి ‘దక్షిణ్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024’లోనూ ఈ సైలెంట్ డీహైడ్రేషన్ అంశం చర్చకు వచ్చింది. దీని లక్షణాలు, దీని వల్ల మానవ శరీరానికి కలిగే ప్రమాదాలు, నివారణ అంశాలపై ప్యానెల్ చర్చించింది. ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ ఎనర్జీ (FEE) మంచి ఆరోగ్యానికి ఎలా అవసరమో చూపించడానికి నిపుణులు శాస్త్రీయ ఆధారాలను సమర్పించారు. ఇదే విషయంపై హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి కన్సల్టెంట్ సర్జియన్ (డివిజన్ ఆఫ్ సర్సికల్ గ్యాస్ట్రోఎంటెరాలజీ & జనరల్ సర్జరీ) డాక్టర్ బీ రవీందర్ రెడ్డి పలు కీలక విషయాలను వెల్లడించారు. ‘ అనారోగ్యంతో ఉన్న 90-95 శాతం మంది వ్యక్తులు సైలెంట్ డీహైడ్రేషన్ తో సతమతమవతూ ఉంటారు. భూమి ఉపరితలం సుమారు 70 శాతం నీటితో ఉంది. అలాగే మానవుల బరువులో దాదాపు 70 నుంచి 80 శాతం నీరు ఉంటుంది.’
‘ ఉదాహరణకు నన్నే తీసుకుంటే.. నా బరువు 70 కిలోలు. అందులో 40-45 కిలోల నీరు ఉంది. నీటి స్థాయులు స్థిరంగా ఉండడానికి నేను ప్రతిరోజూ రెండున్నర నుండి మూడు లీటర్ల నీటిని తీసుకోవాలి. అదే సమయంలో శరీర సమతుల్యతను కాపాడుకోవడానికి నిర్దిష్ఠ స్థాయిలో నీటిని విసర్జించాలి. శరీరంలో నీటి స్థాయులుఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నప్పుడు, అది అండర్ హైడ్రేషన్ లేదా సాధారణ డీహైడ్రేషన్ అని పిలుస్తారు. దీనిని నిర్ధారించడానికి అనేక పరీక్షలు ఉన్నాయి. కానీ సైలెంట్ డీహైడ్రేషన్ ఇలా నిర్ధారించలేం. అనారోగ్యంతో ఉన్న చాలా మంది వ్యక్తులు సైలెంట్ డీహైడ్రేషన్ తో బాధపడుతుంటారు. అందుకే మనం పరిస్థితిని అర్థం చేసుకోవడం, దానికి కారణమేమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం’
జీవక్రియ లేదా అంటు వ్యాధులు తదితర సమస్యలు శరీరంలో నీటి వినియోగాన్ని పెంచుతాయి. ఎందుకంటే మొత్తం వ్యవస్థను మెరుగుపరచడానికి భారీ స్థాయిలో నీరు అవసరం. అదే సమయంలో మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం తక్కువ స్థాయిలో నీరు తాగుతాం. దాహం వేయకపోవడం, అజాగ్రత్తగా ఉండడం తదితర కారణాలతో నీరు తక్కువగా తాగుతాం. ఇదే రోగుల్లో సైలెంట్ డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది కేవల నీటి స్థాయులపైనే ఆధార పడదు. ఉష్ణోగ్రతల కారణంగా కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చు. ఇంట్లోనే ఉన్నప్పటికీ మనం చెమట రూపంలో చాలా నీటిని కోల్పోతుంటాం. అలాగే మనం తీసుకునే మెడిసిన్స్ కూడా ఒక్కోసారి నీటి స్థాయులను తగ్గిస్తాయి. కొన్నిసార్లు ఎంత నీటిని వినియోగించాలో తెలియకపోవడం కూడా SDకి దారితీస్తుంది. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే, వైద్యుడు రోజుకు ఒక లీటరు నీటిని మాత్రమే తీసుకోవాలని, కొన్నిసార్లు అంతకంటే తక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తాడు. కానీ మీరు నివసించే ప్రదేశం ఉష్ణోగ్రత పరిస్థితుల గురించి అవగాహన లేకపోతే శరీరంలో SD స్థితికి దారితీయవచ్చు. ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఇది మంచిదే. కానీ వేడి, తేమతో కూడిన వాతావరణంలో ఉంటే నీటిని తక్కువగా తీసుకుంటూ ఉంటే రోగుల్లో సైలెంట్ డీహైడ్రేషన్ తలెత్తుతుంది’ అని రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదే వేదికపై ఉన్నకెన్‌వ్యూ మెడికల్ అఫైర్స్ థెరపీ ఏరియా హెడ్ (సెల్ఫ్-కేర్) డాక్టర్ హర్షద్ మాల్వే, సైలెంట్ డీహైడ్రేషన్ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ఇందుకోసం ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ ను ఎక్కువగా తీసుకోవాలన్నారు. మన శరీరానికి నీరు చాలా అవసరం నిజమే. కానీ దానితో పాటు ద్రవాల శోషణను సులభతరం చేయడానికి మనకు ఎలక్ట్రోలైట్లు కూడా అవసరం. నీరు లేదా ద్రవాల ఈ శోషణకు, మనకు ఎలక్ట్రోలైట్స్ మాత్రమే అవసరం లేదు, కానీ గ్లూకోజ్ కూడా అవసరం. అనారోగ్యం సమయంలో, శరీరం బేసల్ మెటబాలిక్ రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్లూకోజ్ అవసరాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆకలి తక్కువగా ఉంటుంది. ఆహారం తీసుకోకపోవడంతో శరీరం బలహీనంగా తయారవుతుంది. ఇది కూడా సైలెంట్ డీహైడ్రేషన్ కు దారితీస్తుంది’ అని మాల్వే చెప్పుకొచ్చారు.
‘మనకు దాహం బాగా వేసినప్పుడు డీహైడ్రేషన్ కు గురవుతున్నామని అర్థం. నీరు, పళ్ల రసాలు శరీరంలో శరీరంలోని నీటి సమతుల్యతను మాత్రమే క్రమబద్ధీకరిస్తాయి. అది కూడ కేవలం 30-45% డీహైడ్రేషన్ సమస్యను పరిష్కరిస్తాయి. . శరీరంలోని ద్రవాల సంపూర్ణ సమతుల్యత కోసం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి రోజువారీ కేలరీల తీసుకోవడంపై దృష్టి సారించాలి. ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి’ అని డాక్టర్ బీ రవీందర్ రెడ్డి సూచించారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి