అలర్ట్.. గుండెపోటుకు ముందు ఈ ప్రదేశంలో నొప్పి ప్రారంభమై.. నిమిషాల్లో ప్రాణం పోతుందట..

ప్రస్తుత కాలంలో గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా అందరూ గుండెపోటుకు గురవుతున్నారు.. అయితే.. గుండె కండరాల భాగానికి తగినంత రక్తం అందనప్పుడు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

అలర్ట్.. గుండెపోటుకు ముందు ఈ ప్రదేశంలో నొప్పి ప్రారంభమై.. నిమిషాల్లో ప్రాణం పోతుందట..
Heart Attack
Follow us

|

Updated on: Aug 15, 2024 | 1:52 PM

ప్రస్తుత కాలంలో గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా అందరూ గుండెపోటుకు గురవుతున్నారు.. అయితే.. గుండె కండరాల భాగానికి తగినంత రక్తం అందనప్పుడు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని చికిత్స ఎంత ఆలస్యం అయితే గుండె కండరాలకు అంత నష్టం కలుగుతుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD) గుండెపోటుకు ప్రధాన కారణంగా పరిగణిస్తారు.. గుండెపోటుకు ముందు ఛాతీ నొప్పి వస్తుందని, జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణం కూడా పోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక్కోసారి తీవ్ర వైద్య పరిస్థితులు ఎదురవుతాయి.. గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి..

గుండెపోటు అత్యంత సాధారణ లక్షణాలలో ఛాతీ నొప్పి, ఛాతీలో మంట ఉంటుంది.. ఇంకా ఇతర లక్షణాలు కూడా గుండెపోటును సూచిస్తాయి. కానీ వాటిని సరైన సమయంలో అర్థం చేసుకోలేకపోవడం వల్ల.. రోగి రిస్క్ జోన్‌లోకి వెళ్లిపోయే అవాకాశం ఉంటుంది. అయితే, ఛాతీ నొప్పి ఎల్లప్పుడూ గుండెపోటు కాదు. అటువంటి పరిస్థితిలో.. గుండెపోటుకు ఎలాంటి ఛాతీ నొప్పి లక్షణంగా పేర్కొంటారో ఇప్పుడు తెలుసుకుందాం…

గుండెపోటు – నొప్పిని ఎలా గుర్తించాలి

డాక్టర్ సూచనల ప్రకారం.. ఛాతీ నొప్పి కండరాల నొప్పి కారణంగా కూడా ఉంటుంది. కడుపు నొప్పి, అసిడిటీ, గాల్ బ్లాడర్‌లో రాళ్లు కూడా దీని వెనుక కారణం కావచ్చు. గుండెపోటు నొప్పి అకస్మాత్తుగా వస్తుంది.. 2-3 నిమిషాల్లో వేగంగా పెరుగుతుంది. ఈ నొప్పి కుడి, ఎడమ, ఛాతీ మధ్యలో, దవడ లేదా ఎడమ చేతికి వ్యాపిస్తుంది. ఇది చాలా తీవ్రమైన నొప్పి. గుండెపోటు నొప్పి 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఏదైనా ఇతర నొప్పి ఉంటే.. అది 2 నుంచి 5 నిమిషాల్లో ముగుస్తుంది.

ఇలాంటి నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు…

గుండెపోటు కారణంగా, ఛాతీలో స్థిరమైన నొప్పి ఉంటుంది.. ఇది వాకింగ్ చేసేటప్పుడు గణనీయంగా పెరుగుతుంది.

ఛాతీకి ఎడమ వైపున నొప్పి ఉండి, భుజం లేదా చేతుల వరకు విస్తరించి ఉంటే, అది గుండెపోటు కావచ్చు.

నొప్పి ఛాతీ నుండి మొదలై దవడల వరకు వస్తే, అప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి.

కొన్నిసార్లు ఛాతీ నొప్పి మెడకు విస్తరించి, పెరుగుతూనే ఉంటుంది.. దానిని విస్మరించకూడదు.

ఛాతీలో బిగుతుగా ఉండి బరువుగా అనిపించినట్లయితే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు.

ఇలాంటి ప్రదేశాల్లో నొప్పి ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.. ఆలస్యం చేస్తే నిమిషాల్లోనే ప్రాణం పోయే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..

మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేయండి.. మీ శరీరాన్ని కదలనివ్వండి. అధిక వ్యాయామం మానుకోండి.

ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో వండిన ఆహారాన్ని సమతుల్య పద్ధతిలో తినండి.

మీకు ఏదైనా గుండె జబ్బు ఉంటే డాక్టర్ సలహా మేరకు సమయానికి మందులు వాడండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుండెపోటుకు ముందు ఈ ప్రదేశంలో నొప్పి ప్రారంభమవుతుందట..
గుండెపోటుకు ముందు ఈ ప్రదేశంలో నొప్పి ప్రారంభమవుతుందట..
రుణమాఫీ జరగని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్..
రుణమాఫీ జరగని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్..
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
ఎల్‌జీ నుంచి అదిరే డీల్స్‌.. ఏకంగా రూ. 40వేలు వరకూ ఆదా
ఎల్‌జీ నుంచి అదిరే డీల్స్‌.. ఏకంగా రూ. 40వేలు వరకూ ఆదా
78 ఏళ్లుగా నిరంతరాయంగా మువ్వన్నెల జెండా రెపరెపలు..!
78 ఏళ్లుగా నిరంతరాయంగా మువ్వన్నెల జెండా రెపరెపలు..!
ఫ్రిజ్‌లో ఆహారాలు, పండ్లను ఉంచుతున్నారా? ముందుగా ఇవి తెలుసుకోండి
ఫ్రిజ్‌లో ఆహారాలు, పండ్లను ఉంచుతున్నారా? ముందుగా ఇవి తెలుసుకోండి
మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సాక్ష్యాలు చెరిపేందుకు యత్నం!
మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సాక్ష్యాలు చెరిపేందుకు యత్నం!
యూరినరీ ఇన్ఫెక్షన్స్ నివారించేందుకు 5 అద్భుతమైన సలహాలు
యూరినరీ ఇన్ఫెక్షన్స్ నివారించేందుకు 5 అద్భుతమైన సలహాలు
బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ..
బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ..
నోటిని క్లీన్ చేసిన చిన్న చేప పిల్ల.. ఎలా చేసిందో మీరే చూసేయండి..
నోటిని క్లీన్ చేసిన చిన్న చేప పిల్ల.. ఎలా చేసిందో మీరే చూసేయండి..
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.