మైక్రోవేవ్‌ని స్మార్ట్‌గా వాడేద్దాం.. సగం పనులు చిటికెలో అయిపోతాయ్
15 August 2024
TV9 Telugu
TV9 Telugu
మైక్రోవేవ్ వంటగది పనులను సులభతరం చేస్తుంది. ఆహారాన్ని వేడి చేయడం నుంచి నీటిని వేడి చేయడం వరకు ప్రతిదీ మైక్రోవేవ్‌లో చేయవచ్చు
TV9 Telugu
మైక్రోవేవ్ అవెన్ ఇప్పుడు ప్రతి ఇంట్లో భాగమైపోయింది. బేక్ చేయడం, గ్రిల్ చేయడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాల్ని వండుకోవడానికి, వేడి చేసుకోవడానికీ దీన్ని ఉపయోగిస్తుంటాం
TV9 Telugu
ఉల్లిపాయను పీల్ చేసి రెండు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను మైక్రోవేవ్‌లో వేడి చేయండి. ఇలా చేస్తే ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్లలో నీళ్లు రావు
TV9 Telugu
వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి మైక్రోవేవ్‌లో 30 సెకన్ల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలను ఎలాంటి అడ్డంకి లేకుండా సులభంగా ఊడివస్తాయి
TV9 Telugu
ఒక గిన్నెలో రెండు నిమ్మకాయలను తీసుకుని, మైక్రోవేవ్‌లో 30 సెకన్ల పాటు వేడి చేయాలి. ఇప్పుడు నిమ్మరసం పిండి చూడండి. సులభంగా రసం వస్తుంది
TV9 Telugu
గట్టి పడిన చపాతీ మీద నీళ్లు చల్లి.. ఆ తర్వాత మైక్రోవేవ్‌లో 30 సెకన్ల పాటు వేడి చేసి చూడండి. గట్టి చపాతీ కాస్తా మృదువైన, మెత్తటి చపాతీగా మారుతుంది
TV9 Telugu
ద్రాక్ష, సపోట, మామిడి, అంజీర్ వంటి తాజా పండ్లను కట్ చేసి, మైక్రోవేవ్‌లో ఉంచితే కొన్ని నిమిషాల్లోనే ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్‌ను సిద్ధం చేసుకోవచ్చు
TV9 Telugu
బిస్కెట్లు, క్రాకర్లు, చిప్స్, వంటివి మెత్తబడితే.. మైక్రోవేవ్‌లో కొన్ని నిమిషాలు వేడి చేస్తే అది క్రంచీగా మారుతుంది. వంట మాత్రమే కాకుండా మైక్రోవేవ్‌తో సులభంగా ఈ రోజువారీ పనులు చేయడం ద్వారా సమయం కూడా ఆదా అవుతుంది