మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో యూరిక్ యాసిడ్ ఒకటి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే అది కీళ్లలో పేరుకుపోతుంది. దీంతో చీలమండలు, కాలి బొటనవేళ్లు ఉబ్బుతాయి
TV9 Telugu
మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్’ అనే రసాయనం విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా విసర్జితమవుతుంటుది. మూత్రం సరిగ్గా వెళ్లకపోతే అది రక్తంలో పేరుకుపోతుంది
TV9 Telugu
అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు తీవ్రమైన గౌట్ నొప్పికి దారితీస్తుంది. దీని వల్ల మందులు వేసుకున్నా, ఆహార అలవాట్లలో తప్పనిసరిగా మార్పులు చేర్చుకోవాలి. కొన్ని ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి
TV9 Telugu
ఎండుద్రాక్షలో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్యూరిన్లు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. అందువల్ల వీటిని తీసుకోకపోవడమే మంచిది
TV9 Telugu
యాపిల్ పండ్లు ఆరోగ్యకరం. కానీ యాపిల్స్ ఎక్కువగా తినడం వల్ల గౌట్ సమస్యలు వస్తాయి. వారానికి 3-4 సార్లు యాపిల్ తినవచ్చు
TV9 Telugu
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతుంటే ఖర్జూరాలకు దూరంగా ఉండాలి. ఖర్జూరంలో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది కానీ ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది
TV9 Telugu
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతుంటే సపోటాకు దూరంగా ఉండాలి. 100 గ్రాముల సపోటాలో 8.6 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుందిజ ఇది గౌట్ ప్రమాదాన్ని పెంచుతుంది
TV9 Telugu
100 గ్రాముల చింతపండులో 12.31 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. చింతపండు ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ మరింత పెరుగుతుంది