ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో చీజ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎముకలు గుళ్లబారడం, పగుళ్లు వంటి సమస్యలు రాకుండా ఉండడంలో ఉపయోగపడుతుంది.
చీజ్‌లో విటమిన్ బి12, విటమిన్ ఎ, ఫాస్పరస్, జింక్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతాయి
బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో చీజ్‌ను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
చీజ్‌ను మితంగా తీసుకుంటే పొట్ట ఆరోగ్యం కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో చీజ్ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.
మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే ప్రతీ రోజూ చీజ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చర్మం లోపం నుంచి మెరిసేలా చేయడం చీజ్ ఉపయోగపడుతుంది.
సాధారణంగా మార్కెట్లో ఉప్పు కలిపిన చీజ్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే సోడియం కంటెంట్ లేని సాధారణ చీజ్‌ని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ఎర్ర రక్త కణాలను పెంపొందించడంలో చీజ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ బీ12 శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ధికి ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచరం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.