Cervical cancer: సర్వైకల్ క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు.. ఇకపై 40 శాతం మరణాలు నివారించవచ్చు

|

Oct 16, 2024 | 9:31 PM

ప్రపంచ వ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం చివరి దశలో ఈ క్యాన్సర్ గుర్తించడమే. అయితే తాజా పరిశోధనలు ఈ క్యాన్సర్ చికిత్సలో మెరుగైన పద్ధతిని కనుగొన్నారు. దీని ద్వారా 40 శాతం మరణాలను అడ్డుకోవచ్చంటున్నారు పరిశోధకులు..

Cervical cancer: సర్వైకల్ క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు.. ఇకపై 40 శాతం మరణాలు నివారించవచ్చు
Cervical Cancer
Follow us on

మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ సర్వసాధారణంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. రొమ్ము క్యాన్సర్ తర్వాత, ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యధిక సంఖ్యలో గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతుయి. మరణాల పరంగా రొమ్ము క్యాన్సర్ కంటే గర్భాశయ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల మరణాల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఏటా దాదాపు 4 లక్షల మంది మహిళలు ఈ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో చాలా వరకు చివరి దశలో అభివృద్ధి చెందుతాయి. ఇది చికిత్సను కష్టతరం చేస్తుంది. దీంతో మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పరిశోధకుల రీసెర్చ్‌ ఈ వ్యాధి చికిత్సలో గొప్ప విజయాన్ని సాధించారు. ఈ చికిత్సతో సర్వైకల్ క్యాన్సర్ మరణాలను 40 శాతం తగ్గించవచ్చని అంటున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రతి సంవత్సరం 6,60,00 కొత్త గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల్లో సగానికి పైగా మరణిస్తున్నారు. దీని బారిన పడిన స్త్రీలలో చాలా మంది దాదాపు 50 సంవత్సరాల వయస్సు గలవారు ఉంటున్నారు. 30 నుండి 40 శాతం కేసులలో ఈ క్యాన్సర్ నయమైన తర్వాత మళ్లీ తిరిగి వస్తుంది. రెండో సారి తిరగబెట్టినప్పుడు ఇది మరింత ప్రాణాంతకంగా మారి మరణానికి కారణమవుతుంది. గర్భాశయ క్యాన్సర్‌లో మరణాల సంఖ్య పెరగడానికి కారణం ఆలస్యంగా గుర్తించడమే. చాలామంది మహిళలు నాల్గవ దశలో ఈ క్యాన్సర్‌ను గుర్తి్స్తున్నారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆధునాతన చికిత్సను కనుగొన్నారు. దీని ద్వారా క్యాన్సర్‌ను తొలినాళ్లలోనే గుర్తించి, చికిత్స చేసేందుకు సాధ్యమవుతుంది. తద్వారా మరణ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఈ కొత్త టెక్నాలజీతో సర్వైకల్ క్యాన్సర్ చికిత్స

ఇవి కూడా చదవండి

పెరుగుతున్న గర్భాశయ క్యాన్సర్ కేసుల దృష్ట్యా.. వైద్యులు మెరుగైన చికిత్సను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. సంవత్సరాలుగా దానిపై అధ్యయనాలు చేస్తున్నారు. ఇటీవల వైద్యులు దాని చికిత్సలో సానుకూల ఫలితాలను పొందారు. ఈ పరిశోధనకు UK, మెక్సికో, భారత్‌, ఇటలీ, బ్రెజిల్‌లతో సహా 10 సంవత్సరాలకు పైగా ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలను తీసుకున్నారు. ఈ చికిత్సలో కెమోరేడియేషన్‌కు ముందు కీమోథెరపీని చిన్న సెషన్‌లు ఇచ్చారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ నేతృత్వంలోని ఈ పరిశోధన మూడవ, నాల్గవ దశ క్యాన్సర్ చికిత్సలో చాలా మంచి ఫలితాలను చూపించింది. ఫలితంగా ఈ వ్యాధి నుండి మరణించే ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చని తేలింది. పైగా ఈ క్యాన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదం 35 శాతం తగ్గింది కూడా. మహిళలపై నిర్వహించిన ఈ పరిశోధన ఫేజ్ 3 ట్రయల్‌లో విజయవంతమైనట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కొత్త చికిత్స విధానంపై పెద్ద ఎత్తున పరిశోధన చేయనప్పటికీ, ఈ పరిశోధన ఫలితాలు గర్భాశయ క్యాన్సర్ చికిత్సలో గొప్ప విజయంగా భావిస్తున్నారు

గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

  • ఒకటి కంటే ఎక్కువ భాగస్వాములతో సంబంధాలను కలిగి ఉండటం
  • ధూమపానం
  • గర్భనిరోధక మాత్రలు అధికంగా తీసుకోవడం కలిగి ఉండటం

గర్భాశయ క్యాన్సర్‌ను ఎలా నివారించాలి

  • ధూమపానం మానుకోవాలి
  • ఒకటి కంటే ఎక్కువ భాగస్వాములతో సంబంధాలు ఏర్పరచుకోకుండా ఉండటం
  • చిన్నవయసులోనే శారీరక సంబంధాలు పెట్టుకోకపోవడం మంచిది
  • గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోకూడదు
  • సర్వైకల్ క్యాన్సర్‌ను పరీక్షించడానికి ఎప్పటికప్పుడు పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి
  • గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడానికి టీకాలు వేయించుకోవాలి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.