Breakfast Diet Tips: ఉడికించిన గుడ్లను ‘టీ’తో కలిపి తింటున్నారా? దీని వల్ల కలిగే నష్టాలను తెలుసుకోండి..

|

Mar 16, 2022 | 7:20 AM

Breakfast Diet Tips: చాలా మంది ఉదయాన్ని బ్రేక్‌ ఫాస్ట్‌గా ఉడికించిన గుడ్లను తింటారు. ఆ వెంటనే వేడి వేడి టీ తాగుతారు. ఇలా రెండింటినీ కలిపి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5
బలహీనమైన ఎముకలు: ఉడకబెట్టిన గుడ్లు, టీలను కలిపి తినడం వల్ల శరీరంలో ప్రోటీన్లు బంధించబడతాయి. ప్రోటీన్లు దెబ్బతినడం వల్ల ఎముకలలో నొప్పి ఏర్పడటంతో పాటు.. పటుత్వం మారిపోతుంది.

2 / 5
మలబద్ధకం: టీ, ఉడికించిన గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని చాలా పరిశోధనలలో తేల్చారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టీ, కోడిగుడ్డు కలిపి తినడం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఈ మలబద్ధకం నుండి బయటపడటం అంత సులభం కాదు.

3 / 5
కండరాలు దెబ్బతింటాయి: ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని ప్రొటీన్లు ధ్వంసం అవుతాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ప్రొటీన్ లోపం ఉన్నట్లయితే, దాని చెడు ప్రభావం కండరాలపై కూడా కనిపిస్తుంది. ఫలితంగా కండరాల నొప్పులు వస్తాయి.

4 / 5
చర్మ సమస్య: ఈ రెండింటినీ కలిపి తింటే చర్మ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం సమయంలో ఈ రెండింటిని కలిపి తినొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తినాలనుకుంటే.. గ్యాప్ ఇచ్చి తీసుకోవాలని సూచిస్తున్నారు.

5 / 5
ఎసిడిటీ/గ్యాస్: టీ, ఉడికించిన కోడిగుడ్డును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొట్టలో గ్యాస్, ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య కారణంగా రోజంతా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే వీటిని తినే ముందు ఈ సమస్యలన్నింటినీ గుర్తుంచుకోవడం మంచిది.