డికాక్షన్‌తో కలిగే లాభాలు తెలిస్తే..ఇక మానరు..

రంగు, రుచి, చిక్కదనం..ఈ మూడు పదాలు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే పదం టీ..ఉదయం నిద్ర లేచింది మొదలు..కమ్మటి కాఫీయో, టీ యో గానీ తాగకపోతే పనికాదు. గడగడ లాడించే చలిలో ఒక్క కప్పు టీ తాగితే చాలు ఆ కిక్కే వేరనిపిస్తుంది. అయితే, మనం రోజూ తాగే టీ కంటే..డికాక్షన్‌, లేదా బ్లాక్‌ టీ తాగితే..అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది బ్లాక్‌ టీనే ఇష్టపడతారట. డికాక్షన్‌ […]

డికాక్షన్‌తో కలిగే లాభాలు తెలిస్తే..ఇక మానరు..
Follow us

|

Updated on: Sep 14, 2019 | 12:23 PM

రంగు, రుచి, చిక్కదనం..ఈ మూడు పదాలు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే పదం టీ..ఉదయం నిద్ర లేచింది మొదలు..కమ్మటి కాఫీయో, టీ యో గానీ తాగకపోతే పనికాదు.

గడగడ లాడించే చలిలో ఒక్క కప్పు టీ తాగితే చాలు ఆ కిక్కే వేరనిపిస్తుంది. అయితే, మనం రోజూ తాగే టీ కంటే..డికాక్షన్‌, లేదా బ్లాక్‌ టీ తాగితే..అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది బ్లాక్‌ టీనే ఇష్టపడతారట. డికాక్షన్‌ లేదా బ్లాక్‌ టీ వల్లే ప్రయోజనాలను ఓ సారి పరిశీలిద్దాం… పాలు కలిపిన టీ తాగేవారి కంటే… పాలు కలపకుండా… టీ డికాక్షన్ తాగేవారి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా డికాక్షన్‌ మన బ్రెయిన్‌కి మంచిచేస్తుందట. సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనం మేరకు..డికాక్షన్‌ తాగేవారి బ్రెయిన్‌…70 ఏళ్లు దాటిన వారిలో సైతం చురుగ్గా పనిచేస్తుందట. ఇది‌..బ్రెయిన్‌ పనితీరును పెంచడమే కాకుండా..మెదడుకు రక్షణ కవచంలా ఉంటుందని చెబుతున్నారు. డికాక్షన్‌తో మన ఆరోగ్యం మెరుగవ్వడమే కాదు… గుండె జబ్బులను కూడా పోగొడుతుంది. ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. వారానికి 4 సార్లు గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటివి తాగేవాళ్ల బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తోందని చాలా పరిశోధనల్లో తేలింది.